నిన్న సోమవారం జనవరి 12 న సంక్రాంతి స్పెషల్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం బాక్సాఫీసుని దున్నేస్తుంది. హిట్ టాక్ తో అదిరిపోయే రివ్యూస్ తెచ్చుకున్న వరప్రసాద్ గారి హావా మాములుగా లేదు, బుక్ మై షో ఓపెన్ చేస్తే మన శంకర వరప్రసాద్ గారు టికెట్స్ బుకింగ్ ఫుల్ అవుతున్నాయి.
మెగాస్టార్ వింటేజ్ లుక్ కి మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. నయనతార-చిరు సీన్స్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ మన శంకర వరప్రసాద్ గారు కి కనెక్ట్ అవుతున్నారు. యూత్ మాత్రం క్రింజ్ కామెడీ అంటున్నా చాలామంది ఆడియన్స్ శంకర వరప్రసాద్ కే ఓటేస్తున్నారు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి కి మిక్స్ రెస్పాన్స్ రావడం మన శంకర వరప్రసాద్ కి కలిసొచ్చింది. ఇక రేపు విడుదల కాబోయే అనగనగ ఒక రాజు, నారి నారి నడుమ మురారికి ఎక్స్ట్రార్డినరీ టాక్ వస్తే తప్ప మన శంకర వరప్రసాద్ కి బ్రేకులు వెయ్యడం కష్టం.. అంటూ ఆడియన్స్ మాట్లాడుకోవడం చూస్తే అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతి హీరో అనిపించాడు.




మారుతి మరోసారి ఛాలెంజ్ చేస్తావా..
Loading..