దర్శకుడు మారుతి ప్రస్తుతం రాజసాబ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నా, నేనేమి బాధపడడం లేదు అంటున్నా.. బయట మారుతిపై వస్తున్న ట్రోల్స్ చూస్తే మాత్రం మారుతీ మరోసారి తన ఇంటి అడ్రెస్స్ చెప్పే ప్రయత్నమైతే చెయ్యడనిపిస్తుంది. చాలామంది ఏంటి మారుతి మరోసారి ఛాలెంజ్ చేస్తావా అంటూ ఏడిపించడం సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది.
రాజసాబ్ లో ఏ సీన్ నచ్చకపోయినా మా ఇంటి అడ్రెస్స్ చెబుతా అంటూ కొండాపూర్ లో తన విల్లా అడ్రెస్స్ చెప్పడమే మారుతి ఇరుక్కునేలా చేసింది. కూల్ గా సినిమా విడుదలవుతుంది, నచ్చకపోతే నన్ను తిట్టండి అంటే సరిపోయేది. కానీ ఇంటికి రండి అంటూ అడ్రెస్స్ చెప్పి పొరపాటు చేసాడు.
అందుకే ట్రోల్స్ కూడా భీబత్సంగా వస్తున్నాయి. రాజసాబ్ 200 కోట్ల పోస్టర్ వేసి ఫ్యాన్స్ ని కూల్ చేద్దామన్నా అసలు నెగెటివ్ టాక్ తో స్టార్ట్ అయ్యి 200 కోట్లు ఎలా తీసుకొచ్చింది రాజసాబ్ అంటూ ప్రశ్నిస్తున్నారు యాంటీ ఫ్యాన్స్. మరి మారుతి వీరికి ఏం సమాధానమిస్తాడో చూడాలి. ఒకవేళ రాజసాబ్ ఒక్కటే విదులలై ఉంటె అది సాధ్యమయ్యేది,
కానీ మన శంకర వర ప్రసాద్ గారు, భర్తహామహాశయులకు హిట్ అయ్యి కూర్చున్నాయి, రేపు అనగనగ ఒక రాజు, నారి నారి నడుమ మురారి హిట్ అయితే రాజాసాబ్ సోది లోకి లేకుండా పోతుంది అంటున్నారు.




సాటిస్ఫై అవ్వకపోయినా డిజప్పాయింట్ చెయ్యలె
Loading..