Advertisementt

భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓవర్సీస్ రివ్యూ

Tue 13th Jan 2026 10:02 AM
bhartha mahasayulaku wignyapthi  భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓవర్సీస్ రివ్యూ
Bhartha Mahasayulaku Wignyapthi Overseas Talk భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓవర్సీస్ రివ్యూ
Advertisement
Ads by CJ

రవితేజ-కిషోర్ తిరుమల కలయికలో తెరకెక్కిన భర్త మహాశయులకు విజ్ఞప్తి నేడు జనవరి 13 న సంక్రాంతి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇద్దరు గ్లామర్ హీరోయిన్స్ డింపుల్ హయ్యాతి, ఆషిక రంగనాద్ లు, అద్దిరిపోయే ప్రమోషన్స్ తో భర్తమహాశయులు విజ్ఞప్తి నేడు విడుదలైంది. ఓవర్సీస్ లో ఇప్పటికే షోస్ పూర్తవడంతో ఆడియన్స్ తమ స్పందనను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. 

భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. ఫస్టాఫ్‌‌లో సత్య, వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. అసలు కిషోర్ తిరుమల స్క్రిప్టులో చాలా లోపాలు ఉన్నాయి. వింటేజ్ రవితేజ వైబ్స్ బాగున్నాయి. ఫస్టాఫ్ ఓకే ఓకే, ఇక సెకండాఫ్ కూడా బాగుంది అని కొంతమంది ట్వీట్ చేస్తే.. క్లైమాక్స్ వరకు ఫుల్లుగా ఫన్ మోడ్‌లో సినిమా సాగింది. సెకండాఫ్‌‌లో 30 నిమిషాల నాన్ స్టాప్ కామెడీ బాగుంది. మాస్ మహారాజ్ లో ఉండాల్సిన ఎనర్జీ స్క్రీన్ పై రవితేజలో కనిపించలేదు. పెర్ఫార్మెన్స్ కూడా నచ్చలేదు. సత్య కామెడీ చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా వీక్‌గా ఉంది.. అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. 

ఫస్టాఫ్ లో కొన్ని సీన్లలో కామెడీ వర్కవుట్ అయింది. రవితేజ యాక్టింగ్ చాలా నిరాశపరిచింది. కొన్ని సీన్లలో మాత్రం రవితేజ మాత్రమే బాగా కనిపించాడు. బ్యాక్ టూ బ్యాక్ పాటలు ఇబ్బంది కరంగా ఉంటాయి.. అంటూ మరికొంతమంది నెటిజెన్స్ ట్వీట్లు పెడుతున్నారు. 

Bhartha Mahasayulaku Wignyapthi Overseas Talk :

Bhartha Mahasayulaku Wignyapthi Public Talk 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ