డైరెక్టర్ అనీల్ రావిపూడికి ఇంత వరకూ వైఫల్యమే లేదు. చేసిన ఎనిమిది సినిమాలు మంచి విజయాలు సాధించినవే. వీటిలో ఐదు సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరగా, ఓ సినిమా ఏకంగా 300 కోట్ల వసూళ్లతో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరి ఈ సినిమాలకు అనీల్ పెట్టిన బడ్జెట్ఎంత అంటే? 60 కోట్ల లోపే ఉంటుంది. ఈ రేంజ్ బడ్జెట్ లో సినిమా చేసి 100 కోట్లకు పైగా వసూళ్లు అందించాడంటే? అనీల్ ఏ రేంజ్ డైరెక్టర్ అన్నది చెప్పాల్సిన పనిలేదు.
సినిమా బడ్జెట్ విషయంలో అనీల్ చాలా క్లారిటీగా ఉంటాడు. నిర్మాతకు చెప్పిన బట్జెట్ లోపే సినిమా పూర్తి చేయడం అతడి ప్రత్యేకత. ఎక్కడ అవసరమో? అక్కడే ఖర్చు చేస్తాడు. అనవసరంగా ఖర్చు చేయడు. పైగా ఏ రోజు ఎంత ఖర్చు చేస్తున్నాడు? అన్నది అనీల్ వాట్సాప్ కి సాయంత్రానికి వాట్సప్ వచ్చేస్తుంది. ఆ లెక్క పత్రం వివరాలు నిర్మాతకు చేరుతాయి. సాధారణంగా బడ్జెట్ విషయంలో ఇంత క్లియర్ గా ఏ డైరెక్టర్ కనిపించడు. ఇలా చేయడం వల్ల పారదర్శకత ఉంటుంది.
కింద స్థాయిలో అవినీతికి పాల్పడటానికి అవకాశం ఉండదు. ఏ రోజుకారోజు లెక్కా పత్రం వచ్చేస్తే లెక్క అడగడానికి అవకాశం ఉంటుంది. మొత్తం బడ్జెట్ అంతా ఒకే రోజు చెక్ చేయడం అంటే చిన్న విషయం కాదు. రిలీజ్ తర్వాత అసలే సాధ్యపడదు. ఇవన్నీ గ్రహించే అనీల్ ఏ రోజుకారోజు క్లియర్ గా ఉంటాడు.
ఇలా ఉండటం అన్నది నిర్మాతకు జవాబుదారీ తనంగానూ ఉన్నట్లు అవుతుంది. సినిమా ప్రచారం ఖర్చు కూడా పెద్దగా ఉండదు. అందుబాటులో ఉన్న వారిని వినియోగించుకుని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటాడు. ఈ రకంగా పబ్లిసిటీ ఖర్చు కూడా కలిసొస్తుంది. అందుకే నిర్మాతలంతా అనీల్ నే కోరుకుంటారు. అతడితో సినిమా అంటే? హిట్ సహా మంచి లాభాలు చూడొచ్చు అన్నది నిర్మాతల విశ్వాసం.




BMW అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్
Loading..