బిగ్ బాస్ కి వెళ్లి ఏం సాధించారు అంటే యూట్యూబ్ పెట్టుకుని నాలుగు రాళ్ళు వెనకేసుకున్నాం అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంతేకాని సినిమాల్లో తమని తాము ప్రూవ్ చేసుకున్నామనో, లేదంటే తమకి వెండితెరపై బిగ్ ఆఫర్స్ వచ్చాయనో మాత్రం చెప్పిన బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒక్కరూ లేరు.
శివ జ్యోతి, రోహిణి ఇలా చాలామంది బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక ఓన్ గా యూట్యూబ్ పెట్టుకుని సంపాదించుకుంటున్నారు. ఇప్పుడదే దారిలో విన్నర్ కళ్యాణ్ పడాల కూడా నడవబోతున్నాడు. సీజన్9 విన్నర్ అయ్యాక ఫ్యామిలీతో, స్నేహితులతో, అభిమానులతో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ రిబ్బన్ కటింగ్స్ తో తెగ హడవిడి చేసాడు కళ్యాణ్ పడాల.
తాజాగా కళ్యాణ్ పడాల తాను సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్లుగా చెప్పడమే కాదు.. అందులో తన వ్యక్తిగత విషయాలు, సరదా క్షణాలు, గుణపాఠాలు ఇలా ప్రతీది అభిమానులతో పంచుకునేందుకు యూట్యూబ్ స్టార్ట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఆడియన్స్, అభిమానుల ఆదరణ, ప్రేమ వల్లే తాను ఇంతదూరం వచ్చానని.. ఇప్పుడు యూట్యూబ్ జర్నీకి మీ అందరి సపోర్ట్ కావాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.




సెన్సార్ బోర్డు ఔట్ డేటెడ్ - ఆర్జీవీ
Loading..