దళపతి విజయ్ నటించిన `జననాయగన్` సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉన్నా, సెన్సార్ చిక్కుల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. హైకోర్టులో విజయ్ బృందానికి అనుగుణంగా తీర్పు వెలువడినా కానీ, సీబీఎఫ్‌సి డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేయడంతో తదుపరి విచారణ ఈనెల 21 నాటికి వాయిదా పడింది. కోర్టు వ్యవహారం కారణంగా ఇప్పుడు విజయ్ సినిమా వేసవికి వాయిదా పడినట్టేనని సంకేతాలు అందాయి.
అయితే చిత్రబృందం దీనిని ధృవీకరించలేదు. అయితే సెన్సార్ బోర్డ్ వ్యవహారంపై చాలా మంది సినీప్రముఖులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. సంక్రాంతి రేసు నుంచి వైదొలగాల్సి రావడంతో నిర్మాతలు తమకు వంద కోట్ల నష్టం వాటిల్లినట్టేనని ఆవేదన చెందుతున్నారు. పండగ సెలవులను మిస్ చేసుకోవడంతో ఆ మేరకు తాము నష్టపోయినట్టేనని చెబుతున్నారు.
ఇలాంటి సమయంలో సీబీఎఫ్‌సీపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈరోజుల్లో సెన్సార్ ఔట్ డేటెడ్ అని ఆర్జీవీ ఘాటుగా విమర్శించారు. విజయ్ సినిమా మ్యటర్ లోనే కాదు.. అసలు సెన్సార్ బోర్డ్ అనేది నేటి కాలానికి ఏమాత్రం పనికిరాని ఒక పాత చింతకాయ పచ్చడి లాంటి వ్యవస్థ. ఇది ఇప్పటికీ మిగిలి ఉందంటే అది కేవలం దానిపై చర్చించడానికి మనకున్న బద్ధకమే కారణమని విమర్శించారు. అధునాతన యుగంలో 12 ఏళ్ల పిల్లాడు బూతు సినిమాలు, ఉగ్రవాద హత్యల్ని ఫోన్‌లో చూస్తున్నప్పుడు ఒక డైలాగ్ ని మ్యూట్ చేయడం లేదా సిగరెట్ పొగను బ్లర్ చేయడం ద్వారా సమాజాన్ని రక్షిస్తున్నామని అనుకోవడం పెద్ద జోక్ అని విమర్శించారు.




ఆన్ లైన్ లో ప్రత్యక్షమైన రాజాసాబ్ 
Loading..