Advertisementt

కూర‌లో క‌రివేపాకులా తీసేసాడే!

Wed 07th Jan 2026 07:24 PM
actress  కూర‌లో క‌రివేపాకులా తీసేసాడే!
Heroines కూర‌లో క‌రివేపాకులా తీసేసాడే!
Advertisement
Ads by CJ

అవ‌స‌రం మేర డైరెక్ట‌ర్ ఎంత మంది హీరోయిన్లు? అయినా తీసుకుంటాడు. అలా ఎంపిక చేయ‌డం అన్న‌ది  స్టోరీ, క్యారెక్ట‌ర్ల మీద ఆధార‌ప‌డుతుంది. కొన్ని సినిమాలు త‌క్కువ క్యాస్టింగ్ తో పూర్త‌వుతుంటాయి. మ‌రి కొన్నింటిని భారీ తారాగ‌ణంతో నింపేస్తుంటారు. అలాంటి  ఓ స్టార్ హీరో సినిమా పాన్ ఇండియాలో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతుంది. ఇందులో హీరోకి జోడీగా ఏకంగా ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తున్నారు.

తొలుత ఆ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్ల‌నే ద‌ర్శ‌కుడు అనుకున్నాడు?  కానీ  ఆ విష‌యం హీరో కి తెలియ‌క ఇద్ద‌రు హీరో యిన్లు పెట్ట‌మ‌ని అడిగాడు. అందుకు ఆ ద‌ర్శ‌కుడు ఇద్ద‌రు కాదు, ముగ్గురు హీరోయిన్లు పెడ‌తాన‌ని హీరో ఆనందాన్ని రెట్టింపు చేసాడు. మ‌రి ఇందులో ఏ హీరోయిన్ పాత్రకు ప్రాధాన్య‌త  ఎక్కువ‌గా ఉంటుంది? అంటే ఇద్ద‌రు హీరోయిన్ల పేర్ల‌నే చెప్పాడు. మిగ‌తా హీరోయిన్ ని కూర‌లో క‌రివేపాకులా తీసేసాడు. ఆమెతో హీరో కాంబినేష‌న్ స‌న్నివేశాలు పెద్ద‌గా ఉండ‌వన్నాడు.

కానీ ఆ న‌టి మంచి ప్ర‌తిభావంతురాల‌ని, ప్యూచ‌ర్ లో మంచి హీరోయిన్ అయ్యే అవ‌కాశం కూడా ఉంద‌ని అంచ‌నా వేసాడు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే త‌న సినిమాలో ప్రత్యేకంగా ఆమెని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. ఓ ర‌కంగా ఆమెకి ఆ డైరెక్ట‌ర్ లిప్ట్ ఇస్తున్న‌ట్లే. తెలుగులో రెండు..మూడు సినిమాలే చేసింది. ఆ త‌ర్వాత పెద్ద‌గా అవ‌కాశాలు కూడా రాలేదు. అలాంటి న‌టికి ఓ అవ‌కాశం క‌ల్పించ‌డం అన్న‌ది గొప్ప విష‌యం. సినిమా హిట్ అయితే  ఆ ఛాన్స్  కొత్త అవ‌కాశాల‌కు  దారి తీస్తుంది.  

Heroines:

Actress

Tags:   ACTRESS
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ