రవితేజ - కిషోర్ తిరుమల కాంబోలో సైలెంట్ గా షూటింగ్ ఫినిష్ చేసుకుని భారీ ప్రమోషన్స్ తో పొంగల్ రేస్ లోకి దూసుకొచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం సంక్రాంతి స్పెషల్ గా జనవరి 13 న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. హీరో రవితేజ, హీరోయిన్స్ డింపుల్ హయ్యతి, ఆషిక రంగనాధన్ లు భర్త మహాశయులకు విజ్ఞప్తి పై స్పెషల్ ప్రమోషన్స్ తో హైప్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా మేకర్స్ భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ వదిలారు. కట్టుకున్న భార్యతో ప్రేమగా ఉంటూనే ప్రియురాలి మోజులో పడే భర్త పాత్రలో రవితేజ కామెడీ తో ఇరగదీస్తున్నాడు. సత్య, సునీల్, వెన్నెల కిషోర్ ల కామెడీ ట్రైలర్ లో హైలెట్ అవ్వగా, హీరోయిన్స్ డింపుల్ హయ్యతి ట్రెడిషనల్ గా, ఆషిక రంగంధాన్ మాత్రం గ్లామర్ షో తో అద్దరగొట్టేసింది.
ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ గన్ లు, కత్తులు, ఒరిజినల్ ఫైట్, జాతర ఫైట్ అంటూ చేసేసాను, అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ చిన్న గ్యాప్ ఇవ్వమని చెప్పాడు అంటూ భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా రవితేజ చెప్పిన ఫన్నీ డైలాగ్ తో ట్రైలర్ ని మొదలు పెట్టారు. రవి తేజ లుక్స్, ఆయన స్టయిల్, హీరోయిన్స్ గ్లామర్, ముఖ్యంగా సత్య, వెన్నెల కిషోర్ కామెడీ ఈ చిత్రానికి ప్లస్ కానున్నాయని ఈ ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది.
మరి భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం ఎంత సైలెంట్ గా అయితే షూటింగ్ పూర్తి చేసుకుందో అంతే సైలెంట్ గా ఈ సంక్రాంతికి హిట్ కొట్టినా కొట్టొచ్చు.




సోషల్ మీడియా వల్లే భోళా శంకర్ ప్లాప్ 
Loading..