నందమూరి నటసింహ బాలకృష్ణ బ్లాక్ బస్టర్ చిత్రం నారి నారి నడుమ మురారి టైటిల్ తో కుర్ర హీరో శర్వానంద్ ఈ సంక్రాంతికి అంటే జనవరి 14 న భోగి రోజున ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. బాలయ్య సూపర్ హిట్ టైటిల్ అంటే బాలయ్య ఫ్యాన్స్ ఆగుతారా.. శర్వా సినిమాని భుజాలపై మొయ్యడానికి సిద్ధమైపోయారు.
అయితే బాలయ్య టైటిల్ కదా, దీని కోసం శర్వానంద్ మేకర్స్ ఏమైనా బాలయ్య ను పర్మిషన్ అడిగారా, టైటిల్ కోసం ఏమైనా ఇచ్చుకున్నారా అనే ప్రశ్న నారి నారి నడుమ మురారి ప్రమోషన్స్ లో నిర్మాత అనిల్ సుంకర కు ఎదురైంది. ఆ విషయమై అనిల్ సుంకర మాట్లాడుతూ..
మీ టైటిల్ వాడుకుంటున్నాం సార్ అంటే.. దానికి బాలయ్య 10 ఇయర్స్ అయ్యింది ఇప్పుడు ఏం ఉంది వాడుకోండి అన్నాడు. అదే కొంతమంది ఉంటారు gif కూడా కాపీరైట్స్ వేస్తున్నారు అంటూ అనిల్ సుంకర బాలయ్య మంచితనం గురించి చెప్పగానే అదిరా మా బాలయ్య అంటే అంటూ నందమూరి అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.




నయనతారపై నిర్మాతలు ఒత్తిడి తెస్తున్నారా
Loading..