లేడీ సూపర్ స్టార్ నయనతార `మనశంకరవరప్రసాద్ గారు` ప్రచార కార్యక్రమంలో ఎంత యాక్టిగ్ అటెండ్ అవుతుందో తెలిసిందే. సినిమా ప్రచారమంటనే ససేమేరా అనే నటి చిరంజీవి సినిమాని ప్రత్యేకంగా ప్రచారం చేస్తోంది. ప్రారంభానికి ముందే ప్రీ లాంచ్ ఈవెంట్ తో అదరగొట్టింది. తాజాగా దర్శకుడు అనీల్ రావిపూడితో కలిసి మరో వీడియో లో కూడా కనిపించింది. దీంతో శంకర ప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా నయన్ తప్పక పాల్గోంటుంది అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.
మరి ఇలా అటెండ్ అవ్వడం అన్నది కేవలం ఈ సినిమా వరకేనా? తదుపరి చిత్రాల్లో కూడా ఇలాగే కంటున్యూ అవుతుందా? అన్నది పక్కన బెడితే? నయనతార పై మాత్రం దర్శక, నిర్మాతలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అనీల్ రావిపూడి మాటలతో ఆ విషయంపై ఓ క్లారిటీ వస్తోంది. తన సినిమా ప్రచారం కోసం పాల్గొంటే? నయన్ పై ఒత్తిడి పెరిగిపోతుందంటూ అనీల్ వ్యాఖ్యానించాడు.
ఈ క్రమంలో మిగతా చిత్రాల దర్శక, నిర్మాతలు కూడా తమ సినిమా ప్రచారానికి అటెండ్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారుట. అదనంగా ప్రచారం కోసం ప్రత్యేక పారితోషికం కూడా కల్పిస్తామని ఆఫర్ చేస్తున్నారుట. ఇలాంటి ఆఫర్లు నయనతారకు కొత్తేం కాదు. అమ్మడు సినిమా ప్రచారానికి దూరమైన తర్వాత చాలా మంది దర్శక, నిర్మా తలు ఇలాంటి రిక్వెస్ట్ లు చేసారు.
కానీ అప్పుడు ఎంత మాత్రం కన్విన్స్ కాలేదు. ఆ కారణంగా సినిమాలు కూడా వదులుకుంది. మరి ఇప్పుడు కూడా అంతే కఠినంగా ఉంటుందా? మినహాయింపులు ఏవైనా ఇస్తుందా? అన్నది చూడాలి. ప్రస్తుతం నయనతార కిట్టీలో తొమ్మిది సినిమాలున్నాయి. అన్నీ ఆన్ సెట్స్ లో ఉన్నాయి. వీటిలో వేటికైనా మనశంకరవరప్రసాద్ కు కమిట్ అయినట్లు అయిందా? అన్నది తెలియాలి.




త్యాగరాయ గానసభలో ఉచితంగా శ్రీ విష్ణుసహస్రం
Loading..