Advertisementt

నటి రాశి కి అనసూయ క్షమాపణ

Mon 05th Jan 2026 06:00 PM
anasuya  నటి రాశి కి అనసూయ క్షమాపణ
Anasuya Apologizes to Raasi నటి రాశి కి అనసూయ క్షమాపణ
Advertisement
Ads by CJ

మూడేళ్ళ క్రితం ఒక కామెడీ షో లో నటి రాశి పై ప్రముఖ యాంకర్ అనసూయ చేసిన కామెంట్స్ పై నటి రాశి సోషల్ మీడియా వేదికగా తాజాగా స్పందించడం హాట్ టాపిక్ అయ్యింది. ఈమధ్యన హీరోయిన్స్ డ్రెస్సింగ్ స్టయిల్ విషయంలో అనసూయ నటుడి శివాజీ పై ఫైట్ చేస్తున్న సందర్భంలో రాశి తనపై అనసూయ వేసిన కామెడీ డైలాగ్స్ విషయంలోనూ, దానికి విరగబడి నవ్విన జెడ్జి రోజా విషయంలోనూ ఫుల్ ఫైర్ అయ్యారు. 

ఆ షో లో రాశి గారు ఫలాలు అని అనసూయ డైలాగ్ చెప్పగా అది చూసి రోజా పగలబడి నవ్వింది అంటూ వారు పేర్లు తియ్యకుండా రాశి అనసూయ, రోజా లపై ఆగ్రహం వ్యక్తం చేసారు, ఇదేనా సంస్కారం అంటూ ప్రశ్నిచారు. దానితో అనసూయ వెంటనే రాశి కి క్షమాపణలు చెబుతూ ప్రెస్ నోట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

Dear RAASI garu,

My sincere apologies to you, మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్ లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే.. please accept my apologies..

వెనక్కి వెళ్లి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను. People change and evolve, & మాటలని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచి పెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చు.

ఈరోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి hate campaign నడిపిస్తున్నారు.

నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఆ కార్యక్రమం దర్శక రచయిత నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెప్తున్నాను.

I am more stronger and empowered than before to question the narratives built around womens bodies. Hope you understand and lend your support.. Wishing you well maam అంటూ అనసూయ రాశి ని క్షమించమని కోరింది. 

Anasuya Apologizes to Raasi:

Anasuya Bharadwaj Public Apology To Raasi

Tags:   ANASUYA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ