Advertisementt

సమ్మర్‌లో లెనిన్

Mon 05th Jan 2026 05:47 PM
lenin  సమ్మర్‌లో లెనిన్
Lenin in Summer సమ్మర్‌లో లెనిన్
Advertisement
Ads by CJ

అఖిల్ అక్కినేని హీరోగా మనం ఎంట‌ర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై ముర‌ళి కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తోన్న చిత్రం లెనిన్. ఈ సినిమా నుంచి సోమ‌వారం రోజున వారెవా వారెవా.. అనే లిరిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేవారు. ఈ పాట‌కు అభిమానులు, మ్యూజిక్ ల‌వ‌ర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ పాట‌ను అనంత శ్రీరామ్ రాయ‌గా.. శ్వేతా మోహ‌న్‌, జుబిన్ నౌటియాల్ త‌మ వాయిస్‌తో పాట‌కు ఓ ఎమోష‌న‌ల్ ఫీల్‌ను తీసుకొచ్చారు.

మ్యూజికల్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మన్ సంగీతం సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాట‌ రొమాంటిక్ ఫీల్‌ను క‌లిగిస్తోంది.  సినిమాలోని భావోద్వేగాలను చక్కగా ప్రతిబింబిస్తూ, హీరో–హీరోయిన్ మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేసేలా పాట ఉంది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.

శ‌ర‌వేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు 70 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసింది. మూవీని సమ్మర్‌లో రిలీజ్ చేయ‌టానికి మేక‌ర్స్ సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని స‌ర‌స‌న భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గాన‌టిస్తోంది.

Lenin in Summer:

Akhil Akkineni Lenin Unveils First Track Vaare Vaa Vaare Vaa

Tags:   LENIN
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ