ఎక్కువసార్లు సంక్రాంతి బరిలో క్రేజీగా పోటీపడిన నందమూరి నటసింహ బాలకృష్ణ ఈ సంక్రాంతిని వదిలేసారు. అఖండ 2 తో సంక్రాంతికి వస్తే బావుండేది అనేది నందమూరి అభిమానుల కోరిక, డిసెంబర్ లోనే అఖండ 2 వచ్చేసింది. అయితే ఈ సంక్రాంతి బరిలో బాలయ్య లేకపోయినా ఆయన సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం అందరికి షాకిస్తుంది.
బాలయ్య సంక్రాంతి సీజన్ లో థియేటర్స్ లో రాకపోయినా ఓటీటీలో అఖండ 2 తో సందడి చెయ్యబోతున్నారు. అంతేకాదు ఈ సంక్రాంతికి కోలీవుడ్ లో విడుదల కాబోతున్న జన నాయగన్ చిత్రం వల్ల బాలయ్య ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. కారణం బాలయ్య భగవంత్ కేసరి నే జన నాయగన్ గా రీమేక్ చేసారు.
విజయ్ కి బాలయ్య కి పోలికలు పెడుతూ నందమూరి అభిమానులు భగవంత్ కేసరిని ఓటీటీలో చూస్తూ దానిని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. సోషల్ మీడియాలోనూ బాలయ్య హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఇక జనవరి 9 విజయ్ సినిమా విడుదలయ్యేవరకు బాలయ్యను ఆయన అభిమానులు ట్రెండ్ చెయ్యడం ఖాయం.




జంటగా HYDలో అడుగుపెట్టిన రష్మిక-విజయ్ 
Loading..