న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు విడివిడిగా చెక్కేసిన విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న లు అక్కడ ఇటలీ లో కలిసి తిరిగినా విడివిడిగానే ఫొటోస్ షేర్ చేశారు. గత కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండ-రష్మిక డేటింగ్ లో ఉండడమే కాదు కలిసి వెకేషన్స్ కి వెళుతున్నప్పటికీ అన్ని సీక్రెట్ గానే చేసేవారు.
ఇప్పుడు కూడా నిశ్చితార్ధం చేసుకున్న ఈ జంట విడివిడిగా ఇటలీ వెళ్లారు, అక్కడ విజయ్ దేవరకొండ ఫ్రెండ్స్, తమ్ముడు ఆనంద్ తో కలిసి ఎంజాయ్ చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నా ఆ విషయం బయటపెట్టలేదు. ఈ ఫిబ్రవరి 26 న వివాహం చేసుకోబోతున్న ఈ జంట ఇప్పుడు కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టారు.
ఇటలీ నుంచి ఒకే ఫ్లైట్ లో వచ్చిన వీరు ఒకే కారులో వెళ్లిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి. విజయ్ ముందుగా కారు ఎక్కేయ్యగా రష్మిక ఒడి ఒడిగా వెళ్లి కారు ఎక్కింది. మరి ఇకపై పెళ్ళి చేసుకోబోతున్నారు, అందుకే ఇంత ఓపెన్ గా తిరుగితే తప్పేమిటి అనుకున్నారేమో. అందుకే జంటగా దర్శనమిచ్చారు అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఉదయపూర్ ప్యాలెస్ లో రష్మిక-విజయ్ దేవరకొండ వివాహం జరగబోతున్నట్లుగా తెలుస్తుంది.




అల్లు అర్జున్-స్నేహ లకు చేదు అనుభవం 
Loading..