కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ఆయన చివరి చిత్రంగా చెబుతున్న జన నాయగన్ ఈ పొంగల్ కి విడుదల కాబోతుంది. జనవరి 9 న రేస్ లోకి వచ్చిన జన నాయగన్ క్రేజ్ మాములుగా లేదు. విజయ్ చివరి సినిమా కావడంతో జన నాయగన్ పై భీభత్సమైన ఆసక్తిని విజయ్ అభిమానులు చూపిస్తున్నారు.
మరోపక్క ఓవర్సీస్ లో జన నాయగన్ టికెట్ బుకింగ్స్ పరంగా రికార్డ్ లను సృష్టిస్తుంది. తమిళనాడులో చెప్పక్కర్లేదు, విజయ్ అభిమానులు జన నాయగన్ ఫోబియా తో ఊగిపోతున్నారు. మలేషియాలో నిర్వహించిన జన నాయగన్ ఆడియో లాంచ్ వేడుకకి విజయ్ అభిమానులు 85 వేల మంది హాజరయ్యారు. అక్కడికీ.. పోలీసులు కట్టడి చెయ్యబట్టి. లేదంటే లక్షల్లో విజయ్ కోసం తరలి వచ్చేవారే.
మరి తెలుగులో ప్రమోషన్స్ లేవు, చెన్నై లో జన నాయగన్ ప్రమోషన్స్ లేవు, దేశ వ్యాప్తంగా జన నాయగన్ ను ప్రమోట్ చెయడం లేదు, అయినప్పటికి సినిమా పై విపరీతమైన క్రేజ్, విజయ్ లాస్ట్ మూవీ అని అనౌన్స్ చెయ్యడమే దీనికి కారణముగా కనబడుతుంది. అన్నట్టు జన నాయగన్ తెలుగులో తెరకెక్కిన భగవంత్ కేసరి కి రీమేక్, ఆ విషయం జన నాయగన్ ట్రైలర్ తోనే స్పష్టమైంది.




రణ్వీర్ ఆ తప్పు చేయకపోయి ఉంటే
Loading..