2017లో వచ్చిన తెలుగు బ్లాక్ బస్టర్ `అర్జున్ రెడ్డి`ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. షాహిద్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 275 కోట్లకు పైగా వసూలు చేసింది. షాహిద్ కెరీర్ మొదటి 100కోట్ల క్లబ్ సినిమాగా రికార్డులకెక్కింది.
అయితే ఈ చిత్రం ఇంత పెద్ద హిట్టవుతుందని ఊహించని రణ్ వీర్, తన వైపు వచ్చిన అవకాశాన్ని కాదనుకున్నాడట. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు సందీప్ వంగా గతంలోనే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అర్జున్ రెడ్డి చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాక, హిందీ పరిశ్రమ నుంచి చాలా కాల్స్ వచ్చాయని, అర్జున్ రెడ్డిని రీమేక్ చేయాలని కోరారని తెలిపాడు. అలా తాను స్క్రిప్టు రెడీ చేసి మొదటగా రణ్ వీర్ ని కలిసానని సందీప్ వంగా చెప్పాడు. కానీ ఆ పాత్రలో డార్క్ షేడ్ ఉందని అప్పట్లో రణ్ వీర్ అంగీకరించలేదు. చివరికి షాహిద్ ని సందీప్ వంగా ఒప్పించాడు. అయితే అప్పటికి షాహిద్ కెరీర్ పూర్తిగా జీరో అయిపోయింది.
కొన్ని వరుస ఫ్లాపులతో నీరసించిపోయాడు. ఆ కుర్రాడు ఏం చేస్తాడు? రణ్ వీర్ అయితే మార్కెట్ బావుంటుందని చాలా మంది నిపుణులు సలహా ఇచ్చారు. కానీ తాను షాహిద్ కి మాత్రమే కట్టుబడి ఉన్నానని సందీప్ వంగా తెలిపాడు. చివరికి షాహిద్ పై ఉంచిన నమ్మకం నిజమైంది. కబీర్ సింగ్ పెద్ద హిట్టయింది. బోల్డ్ నెస్‌పై కొన్ని విమర్శలు చెలరేగినా ప్రజలు థియేటర్లకు వచ్చి సినిమా చూసి ఆస్వాధించారు. దురంధర్ తో చాలా కాలానికి రణ్ వీర్ కోలుకున్నాడు. నిజానికి అర్జున్ రెడ్డి రీమేక్ లో నటించి ఉంటే, ఇలాంటి విజయాన్ని అప్పట్లోనే అందుకునేవాడు!




రాజాసాబ్ పారితోషికాల లెక్కలు 
Loading..