హీరో ఆది సాయి కుమార్ ఎన్నో ఏళ్లుగా సక్సెస్ కోసం యుద్ధం చేస్తున్నాడు. వరస ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. కానీ విజయం ఆది ని వరించడం లేదు. ఆది సాయి కుమార్ తండ్రి నటుడు సాయి కుమార్ కూడా కొడుకు కెరీర్ విషయంలో మధన పడుతున్నారు. ఆల్మోస్ట్ ఆది కెరీర్ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో శంబాల రూపంలో ఆదికి మంచి హిట్ దక్కింది.
గత ఏడాది డిసెంబర్ లో క్రిష్టమస్ సందర్భంగా విడుదలైన శంబాల కు పాజిటివ్ టాక్ రావడమే కాదు, మంచి కలెక్షన్స్ రాబడుతున్న సమయంలోనే ఆది మరో గుడ్ న్యూస్ వినిపించాడు. ఆది సాయి కుమార్-అరుణ దంపతులకు ఈ ఏడాది కొత్త సంవత్సర కానుకగా అబ్బాయి జన్మించాడు. ఆది-అరుణ దంపతులకు మొదటిసారి పాప జన్మించగా.. రెండో డెలివరీలో బాబు పుట్టాడు.
వారం క్రితమే శంబాల తో హిట్ అందుకుని సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఆది జీవితంలోకి వారసుడు రావడం మరింత సంతోషాన్నిచ్చింది. సాయి కుమార్ ఫ్యామిలిలో ఇప్పుడు ఆనందం వెల్లువిరిసింది. మనవడి రాకతో సాయి కుమార్ కూడా చాలా సంతోషంగా ఉన్నట్లుగా తెలుస్తుంది.




డైరెక్టర్ కారణంగా చిరు తో ఛాన్స్ మిస్!
Loading..