మెగాస్టార్ చిరంజీవితో దాదాపు ఆయన జనరేషన్ హీరోయిన్లు అంతా కలిసి పనిచేసిన వారే. రాధ, రాధిక, శోభన, దివ్యభారతి, నగ్మ, వాణీ విశ్వనాధ్ ఇలా వీరంతా చిరంజీవితో చాలా సినిమాలు చేసారు. కానీ అందాల ఆమని మాత్రం చిరుతో కలిసి పని చేయలేదు. మరి ఆ ఛాన్స్ ఆమని ఎలా మిస్ అయ్యారు అంటే? ఓ డైరెక్టర్ కారణంగా వచ్చిన అవకాశం సైతం చేజారిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చిరంజీవి హీరోగా `రిక్షావోడు` చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ రూపొందించి చిరుకు మరో హిట్ అందించారు. ఇందులో హీరోయిన్ గా నగ్మ నటించింది. అయితే నగ్మ స్థానంలో ముందుగా ఆమని హీరోయిన్ గా ఎంపికైంది. నిర్మాతలు డేట్లు కూడా లాక్ చేసి పెట్టారు. కానీ అనూహ్యంగా దర్శకుడు మారడంతోనే ఆమని ఛాన్స్ కోల్పోయింది. వాస్తవానికి ఈసినిమాకు ముందు దర్శకుడిగా కోదండరామిరెడ్డిని తీసుకున్నారు.
కానీ అనూహ్యంగా ఆయన తప్పుకోవడంతో? ఆ స్థానంలోకి కోడి రామకృష్ణ వచ్చారు. ఆయన ఎంట్రీ తో ఆమని అనుమతి లేకుండా ఆమెను తప్పించి నగ్మను తీసుకున్నారు. అలా ఆమని చిరుతో రాక రాక వచ్చిన ఒక్క అవకా శాన్ని కూడా కోల్పోయింది. చిరంజీవితో నటించడం ఆమని కల. చిన్నప్పటి నుంచి చిరుకు వీరాభిమాని. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూడగా వచ్చిన ఒక్క అవకాశం నగ్మ కారణంగా కోల్పోయింది.
అప్పటి నుంచి చిరుతో కలిసి పనిచేసే మరో అవకాశం రాలేదని ఆమని రివీల్ చేసింది. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఆమని ఇప్పటికే అదే అందంతో అలరిస్తున్నారు. 50 ఏళ్ల వయసులోనే తరగని అందం ఆమె సొంతం. చిరంజీవి ఒకే చెప్పాలి గానీ ఆమని సిద్దంగానే ఉన్నారు.




రాజాసాబ్ సౌండ్ సరిపోద్దా 
Loading..