దర్శక దిగ్గజం రాజమౌళి ఇంత వరకూ ఇతర భాషల హీరోలతో సినిమాలు చేయలేదు. టాలీవుడ్ స్టార్లతోనే పని చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లతో పని చేసారు. ప్రస్తుతం మహేష్ తో పని చేస్తున్నారు. అనంతరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా పనిచేసే అవకాశం ఉంది. మహేష్, బన్నీతో పూర్తయితే? పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్లు అంతా పూర్తయినట్లే. నిఖిల్, తేజ లాంటి యంగ్ హీరోలు పాన్ ఇండియాలో సక్సెస్ అయినా? ఇప్పుడే ఆ ఛాన్స్ తీసుకోరు.
అందుకు ఇంకా సమయం పడుతుంది. మరి ఆ తర్వాత రాజమౌళి హీరో ఎవరు? అంటే! ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. సీనియర్లు చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్లను టచ్ చేసే అవకాశం కూడా తక్కువ. రాజమౌళి కావాల్సింది పాన్ ఇండియా హీరోలు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ సినిమా చేయమని ఆఫర్ చేసినా? రాజమౌళి ఇప్పట్లో చేసే ఆలోచనలో లేరని తెలుస్తోంది. ఇక సౌత్ రీజియన్ నుంచి చూసుకుంటే? అందుకు అవకాశం ఉన్న పాన్ ఇండియా స్టార్లు ఇద్దరు ఉన్నారు.
వారే సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్. రజనీకాంత్ పాన్ వరల్డ్ స్టార్. అతడి ఇమేజ్ రాజమౌళి దర్శకుడు కాకముందే విశ్వవ్యాప్తమైంది. కాబట్టి రజనీ విషయంలో రాజమౌళి ఆలోచించే అవకాశం ఉంది. కానీ రజనీ ...రాజమైళికి సహకరిస్తారా? లేదా? అన్నది సందేహమే. ఎందుకంటే రాజమౌళితో సినిమా అంటే అతడితో పాటే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సెట్స్ లో సినిమా ఉన్నంత కాలం బాండ్ అయి పనిచేయాలి.
కానీ అందుకు రజనీ పూర్తి స్థాయిలో సిద్దంగా ఉంటారా? లేదా? అన్నది డౌటే. కానీ కమల్ హాసన్ మాత్రం రాజమౌళికి అన్ని రకాలుగా సెట్ అవుతారు. 70 ఏళ్లు దాటినా కమల్ హాసన్ ఇంకా ఎంతో ఉత్సాహంగా పని చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో సైతం ఎంతో ఎనర్జిటిక్ గా పాల్గొంటారు. అతడి ఫిట్ నెస్ వేరే లేవల్లో. కమల్ కోసం జక్కన్న ఎలాంటి స్టోరీ రెడీ చేసినా? అందుకు అనుకూలంగా కమల్ పని చేయగలరు.




పోలిశెట్టి కి పోటీనే లేదు 
Loading..