నవీన్ పోలిశెట్టి కి ఎదురులేదు, పోటీనే లేదు. తన సినిమాని ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్ళాలో, ఎలా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించాలో అనేది నవీన్ పోలిశెట్టి కి తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో. మిడ్ రేంజ్ సినిమాలతోనే తనకంటూ ఫ్యాన్ బేస్ ని ఏర్పా టు చేసుకున్న నవీన్ పోలిశెట్టి తన సినిమాలకు సూపర్ గా ప్రమోట్ చేసుకుని ఆడియన్స్ రప్పిస్తాడు.
ఇప్పుడు సంక్రాంతి బరి లో తన సినిమాని ఎక్కడ తొక్కేస్తారో, ఆడియన్స్ కి తన సినిమా కనిపించదు అని నవీన్ పోలిశెట్టి కంకణం కట్టుకుని మరీ అనగనగ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. గత వారం రోజులుగా ఎక్కడ చూసినా నవీన్ పోలిశెట్టి నే కనిపిస్తున్నాడు. హీరోయిన్ మీనాక్షి తో కలిసి నవీన్ చేసే ప్రమోషన్స్ మాములుగా లేవు.
యూత్ కి అట్రాక్ట్ అయ్యేలా నవీన్ పోలిశెట్టి మాటలు, ఆయన యాక్షన్ అన్నిటికి స్టూడెంట్స్ సహా యూత్ కనెక్ట్ అవుతున్నారు. అటు సంక్రాంతి ఫిలిమ్స్ అన్నిటిలో అనగనగ ఒక రాజు హిట్ అనే టాక్ మాత్రం గట్టిగా వినిపిస్తుంది.




విజయ్ చివరి సినిమాకి సెన్సార్ చిక్కులు 
Loading..