చాలామంది సెలబ్రిటీస్ నూతన సంవత్సరాన్ని విదేశాల్లో సెలెబ్రేట్ చేసుకంటారు. వెకేషన్స్ ప్లాన్ చేసుకుని ఓల్డ్ ఇయర్ కి గుడ్ బై చెబుతూ.. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. రష్మిక, విజయ్ లు అలానే వెకేషన్ కి వెళ్లారు, సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ తో కలిసి ట్రిప్ వేశారు.
ఇక మెగా హీరో వరుణ్ తేజ తన భార్య లావణ్య త్రిపాఠి కొడుకు వాయువ్ తేజ్ ని తీసుకుని విదేశాలకు వెళ్ళిపోయాడు. బీచ్ ఒడ్డున భార్యతో కలిసి నడుస్తూ కొడుకుతో ఆడుకుంటూ ఉన్న ఫొటోస్ ని వరుణ్ తేజ్ షేర్ చేసాడు. అయితే తన కొడుకు వాయువ్ తేజ్ ఫొటోస్ ని వరుణ్ తేజ్ షేర్ చేసిన ఫేస్ మాత్రం రివీల్ చెయ్యలేదు.
గత ఏడాది నాగబాబు ఫ్యామిలీలోకి వాయువ్ తేజ్ రాక మెగా ఫ్యామిలీ ఆనందాన్నిచ్చింది. మెగా వారసుడిగా వరుణ్ కొడుకు వారి ఫ్యామిలోకి అడుగుపెట్టడంతో మెగా ఫ్యామిలీ సంబరపడిపోయింది. కొడుకుతో మొదటి న్యూ ఇయర్ వేడుకలను వరుణ్-లావణ్య జంట విదేశాల్లో సెలెబ్రేట్ చేసుకుంది.




ప్రభాస్ ని ఇరికించేసిన యంగ్ హీరో 
Loading..