చాలామంది హీరోలు ప్రభాస్ పెళ్ళెప్పుడు చేసుకుంటే మేము అప్పుడు చేసుకుంటామని చెబుతూ ఉంటారు. ఇప్పుడొక కుర్ర హీరో ప్రభాస్ పెళ్లి చేసుకున్న తర్వాతే నా పెళ్లి అంటూ పబ్లిక్ గా ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ సంక్రాంతికి అనగనగ ఒక రాజు చిత్రంతో ఆడియన్స్ ముందు రాబోతున్న నవీన్ పోలిశెట్టి తన పెళ్లికి గురించి అడుగుతున్న వారికి బిగ్ షాక్ ఇచ్చాడు.
చాలామంది ప్రభాస్ పెళ్లి చేసుకుంటే మేము చేసుకుంటామన్నారు కానీ.. నవీన్ పోలిశెట్టి మాత్రం ప్రభాస్ అన్న పెళ్లి అయిన నెక్స్ట్ డే నే నా పెళ్లి అంటూ చెప్పాడు. మరి ప్రభాస్ పెళ్ళెప్పుడు చేసుకోవాలి, నవీన్ పోలిశెట్టి కి పెళ్ళెప్పుడు అవ్వాలి అనేది ఇప్పుడు ధర్మ సందేహంగా కనిపిస్తుంది.
కృష్ణం రాజు బ్రతికున్నప్పటినుంచి ప్రభాస్ పెళ్లిపై అభిమానులు అడుగుతూనే ఉన్నారు, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కూడా ప్రభాస్ పెళ్లి విషయంగా పూజలు గట్రా చేస్తూ ఇదిగో అదిగో ప్రభాస్ పెళ్లి అంటూ ఊరిస్తున్నారు, ప్రభాస్ ఏమో అమ్మాయిల్లో ఏ క్వాలిటీస్ నచ్చాలి అంటే అది తెలియకే పెళ్లి చేసుకోలేదు అంటున్నాడు. మరి ఇన్ని ప్రోబ్లెంస్ ఉన్న ప్రభాస్ పెళ్లితో నవీన్ పెళ్లి ముడిపడి ఉందన్నమాట.




సఃకుటుంబానాం చిత్ర రివ్యూ 
Loading..