జన నాయగన్ చిత్రంతో తాను సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్టుగా హీరో విజయ్ మలేషియా లో జన నాయగన్ ఈవెంట్ లో అనౌన్స్ చేసారు. అసలు GOAT చిత్రంతోనే ఆయన సినిమాలకు గుడ్ బై చెబుదామనుకుంటే ఆ చిత్రం అట్టర్ ప్లాప్ అవడంతో, ప్లాప్ తో రాజకీయాల్లోకి వెళ్లడం ఎందుకులే అని విజయ్ జన నాయగన్ చిత్రాన్ని చేసి అప్పుడు సినిమాల నుంచి తప్పుకుందామనుకున్నారు.
ఈ చిత్రం పొంగల్ స్పెషల్ గా విడుదల కాబోతుంది. అయితే విజయ్ ఈ చిత్రం తర్వాత రాజకీయాల్లో బిజీ అవుదామనుకున్నారు. మరి విజయ్ ఆశ నెరవేరి జన నాయగన్ హిట్ అవుతుందా.. ఈ చిత్రం తో విజయ్ కోరిక నెరవేరుతుందా అనేది చాలామందిలో కాదు యాంటీ ఫ్యాన్స్ లో ఉన్న అనుమానం.
విజయ్ క్రేజ్ తో జన నాయగన్ చిత్రంతో భారీ ఓపెనింగ్స్ సాధించడం ఖాయం. టాక్ ని బట్టి జన నాయగన్ రిజల్ట్ ఆధారపడింది. మరా సినిమా హిట్ అయ్యి విజయ్ ని రాజకీయాల్లోకి హ్యాపీగా పంపిస్తుందో, లేదో అనేది జస్ట్ 12 రోజులు వెయిట్ చేస్తే సరి.




ఫైనల్లీ లెనిన్ అప్ డేట్ వచ్చిందండోయ్
Loading..