అక్కినేని యంగ్ హీరో అఖిల్ లేటెస్ట్ చిత్రం లెనిన్. అబ్బూరు మురళి కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లెనిన్ చిత్రానికి సంబందించిన అప్ డేట్స్ లేకపోవడంతో ఈ మద్యన లెనిన్ విషయంలో చాలారకాల ప్రచారాలు వినిపించడం, దానికి అక్కినేని అభిమానులు ఫీలైపోవడం చూసాము, మరోపక్క లెనిన్ విషయంలో నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నారు.
అఖిల్ ని హీరోగా నిలబెట్టేందుకు ఆయన కొత్త చిత్రాన్ని కూడా షూటింగ్ స్టార్ట్ చెయ్యలేదు, లెనిన్ విషయంలో నాగార్జున అన్ని పర్టిక్యులర్ గా చూసుకుంటున్నారు, ఈమధ్యన మరోపక్క కొన్ని సన్నివేశాలు నచ్చక రీ షూట్ చేస్తున్నారనే టాక్ నడిచింది. అవన్నీ వదిలేసి సడన్ గా న్యూ ఇయర్ సందర్భంగా లెనిన్ అప్ డేట్ వదిలారు మేకర్స్.
లెనిన్ ఫస్ట్ సింగిల్ జనవరి 5 న రాబోతున్నట్లుగా లెనిన్ మేకర్స్ న్యూ ఇయర్ రోజున అనౌన్స్ చెయ్యడంతో.. హమ్మయ్య ఫైనల్లీ లెనిన్ అప్ డేట్ వదిలారుగా అంటూ మాట్లాడుకుంటుంటే.. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం అఖిల్ లెనిన్ అప్ డేట్ కదిలిందిగా అంటూ హ్యాపీ గా ఫీలవుతున్నారు.




మారుతి నాశనాన్ని కోరుకుంటున్నదెవరు
Loading..