ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజసాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. రాజాసాబ్ కంటెంట్, ప్రమోషన్స్ ఫ్యాన్స్ ని వేరే లోకంలోకి తీసుకెళుతున్నాయి. రీసెంట్ గా వదిలిన రాజసాబ్ రిలీజ్ ట్రైలర్ ఇప్పటివరకు ఎక్కడో ఉన్న చిన్న చిన్న అనుమానాలను పటాపంచలు చేసింది. మారుతి పై నమ్మకంతో ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ ప్రమోషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే రీసెంట్ గా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ తో కలిసి స్పిరిట్ సెట్ పైకి వెళ్లారు. ప్రభాస్ పిలక లుక్ స్పిరిట్ లోదే అని ఆయనే రాజాసాబ్ ఈవెంట్ లో రివీల్ చేశారు. దానితో ప్రభాస్ ఫ్యాన్స్ స్పిరిట్ నుంచి జనవరి 1 న ప్రభాస్ ఫస్ట్ లుక్ వదిలితే బావుండు అని ఆశపడుతున్నారు. నిన్నగాక మొన్న మొదలైన స్పిరిట్ నుంచి ఫస్ట్ లుక్ కోసం ఆశపడడం తప్పులేదు.
కానీ సంక్రాంతి బరిలో రాజాసాబ్ ఉంది, ఆ సినిమా రిలీజ్ తో ఎగ్జైట్ అవుతున్న అభిమానులకు స్పిరిట్ నుంచి కూడా సర్ ప్రైజ్ కావాలనుకోవడమే అత్యాశ అవుతుంది అనే మాట సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది. ఆశపడడంలో తప్పులేదు కానీ అతిగా ఆశపడితేనే అంటూ దీర్ఘాలు తీస్తున్నారు నెటిజెన్స్.




రీతూ-పవన్ అస్సలు తగ్గట్లే
Loading..