Advertisementt

సంక్రాంతి సినిమాలకు వార్నింగ్

Mon 29th Dec 2025 08:52 PM
the raja saab  సంక్రాంతి సినిమాలకు వార్నింగ్
Warning to Sankranthi films సంక్రాంతి సినిమాలకు వార్నింగ్
Advertisement
Ads by CJ

జనవరి లో సంక్రాంతి సీజన్ లో ఎన్ని సినిమాలు వచ్చినా అన్ని సినిమాలకు గిరాకీ ఉంటుంది. అంత స్టఫ్ ఉంటేనే ఆ సీజన్ బరిలో పోటీపడేందుకు రెడీ అవుతారు హీరోలు. 2026 సంక్రాంతికి క్రేజీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో జనవరి 9 న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ద రాజ్, జనవరి 12 న మెగాస్టార్ చిరు మన శంకర వరప్రసాద్ గారు, జనవరి 13 న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి విడుదలవుతున్నాయి. 

జనవరి 14 న నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు, అదే 14 న శర్వానంద్ నారి నారి నడుమమురారి చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి అయితే ఈ సంక్రాంతి సినిమాలన్నిటికి ద రాజసాబ్ వార్నింగ్ ఇచ్చిందా అన్నట్టుగా ఉంది ప్రస్తుత వ్యవహారం. జనవరి 9 న విడుదల కాబోతున్న రాజాసాబ్ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు ఒక ఎత్తు, ఇకపై మరొక ఎత్తు. ఈరోజు సోమవారం వదిలిన రిలీజ్ ట్రైలర్ చూసాక రాజాసాబ్ సంక్రాంతి సినిమాలకు వార్నింగ్ ఇచ్చాడంటూ మాట్లాడుకుంటున్నారు. 

ఈ ట్రైలర్ చూసిన వారు విజువల్ వండర్, మారుతి ఇది కదా మాకు కావల్సింది, ప్రభాస్ యాక్షన్, ఆయన డాన్స్ వేరే లెవల్, ఒక్క ట్రైలర్ తో అన్ని మార్చేసారు, ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ లో వేరియేష‌న్స్, మారుతి మేకింగ్, విజువల్స్ అన్ని రాజసాబ్ పై అంచనాలు పెరిగేలా చేసాయి. 

ఇప్పటివరకు ఎక్కడో చిన్న అనుమానం రాజసాబ్ పై కనిపించినా.. ఇప్పుడు వచ్చిన ట్రైలర్ అన్నిటిని పటాపంచలు చేసేసింది. ద రాజసాబ్ సంక్రాంతికి హిట్టు బొమ్మ అంటూ అన్ని వైపులా నుంచి రాజాసాబ్ పై పాజిటివ్ వైబ్స్ రావడం చూసి ఈ రాజసాబ్ సంక్రాంతి సినిమాలకు వార్నింగ్ లా కనిపిస్తుంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Warning to Sankranthi films:

The Raja Saab Release trailer talk

Tags:   THE RAJA SAAB
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ