Advertisementt

AA 22 ఓటీటీ డీల్ సెన్సేషనల్

Mon 29th Dec 2025 08:21 PM
aa22  AA 22 ఓటీటీ డీల్ సెన్సేషనల్
Massive OTT Deal Under Negotiation For AA22 AA 22 ఓటీటీ డీల్ సెన్సేషనల్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో ఇంటర్నేషనల్ మూవీకి శ్రీకారం చుట్టడమే కాదు, షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. అనౌన్సమెంట్ తోనే  AA 22 పై అందరిలో విపరీతమైన అంచనాలు, అందుకు తగిన అంచనాలను క్రియేట్ చేసారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ ను కూడా కాదని అట్లీ తో మూవ్ అయ్యారు. 

ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. దీపికా తో పాటుగా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్స్ నటిస్తున్నారు. అందుకే ఈప్రాజెక్టు పై అందరిలో క్యూరియాసిటీగా ఉన్నారు. అయితే ఇప్పుడు AA 22 చిత్రానికి సంబందించిన ఓటీటీ డీల్ ఇప్పడు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. 

ఇప్పటివరకు ఫస్ట్ లుక్ కూడా విడుదల కానీ ఈ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా రూ. 600 కోట్లు ఆఫర్ చేసినట్టుగా  తెలుస్తోంది. పుష్ప 2 చిత్రం ద్వారా నెట్ ఫ్లిక్స్ లాభాలు పొందడంతో ఇప్పడూ AA 22 కోసం ఇంత భారీ మొత్తాన్ని మేకర్స్ కి ఆఫర్ చేసినట్లుగా సమాచారం. ఈ వార్త చూసిన అల్లు ఫ్యాన్స్ ఫుల్ గా పండగ చేసుకుంటున్నారు.  

Massive OTT Deal Under Negotiation For AA22:

Allu Arjun and Atlee AA22 X A6 Bags 600 Crore Netflix Deal 

Tags:   AA22
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ