అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఈ ఏడాది తనుప్రేమించిన నయనిక ని పెద్దల అంగీకారంతో ఇరు కుటుంబాల నడుమ అంగరంగ వైభవంగా నిశ్చితార్ధం చేసుకున్న అల్లు శిరీష్ వివాహ తేదీని ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా అని అల్లు అభిమానులు ఎదురు చూడని రోజు లేదు. తాజాగా అల్లు సిరీస్ పెళ్లి డేట్ ని కాస్త డిఫ్రెంట్ గా రివీల్ చేసింది అల్లు ఫ్యామిలీ.
అల్లు శిరీష్ అన్నల పిల్లలు అంటే బాబీ కుమార్తె, అల్లు అర్జున్ కొడుకు ఆయన్, అర్హలు బాబాయ్ పెళ్లి ఎప్పుడు అని అడగగా.. దానికి 2026 మార్చి 6 అని అల్లు శిరీష్ బదులివ్వడం.. దానితో పాటుగా సంగీత్ ఎప్పుడు అని అడిగితే, మనం సౌత్ ఇండియన్స్ మనకు అలాంటివి ఉండవు అంటూ ఓ రీల్ తో అల్లు శిరీష్ పెళ్లి తేదీని అల్లు ఫ్యామిలీ కాస్త కొత్తగా రివీల్ చేసింది.
సోషల్ మీడియా రీల్స్ తో అల్లు శిరీష్ వెడ్డింగ్ తేదీని అల్లు ఫ్యామిలీ రివీల్ చేయడంపై నెటిజెన్స్ కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు. సో వచ్చే ఏడాది మార్చ్ లో అల్లు శిరీష్-నయనిక ల వివాహం జరగబోతుందన్నమాట.




బిగ్ బాస్ 9 విన్నర్ అలా - రన్నర్ ఇలా
Loading..