బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గా నిలిచిన కళ్యాణ్ పడాల ప్రస్తుతం ఆ సక్సెస్ ని సెలబ్రేషన్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడు, విలేజ్ మీటింగ్స్, ఫ్యాన్స్ మీటింగ్స్, కాలేజ్ లో సన్మానాలంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. హౌస్ లో మొదట్లో డేంజర్ జోన్ లో ఉన్న కళ్యాణ్ చివరికి విన్నర్ గా నిలిచిన కళ్యాణ్ పడాల కు అభిమానులు కోకొల్లలుగా పెరిగిపోయారు.
ఆర్మీ మ్యాన్ నుంచి సెలెబ్రిటీ హోదాలోకి చేరుకున్న కళ్యాణ్ ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు. విన్నర్ కాబోయి జస్ట్ రన్నర్ గా మిగిలిపోయిన తనూజ పుట్టస్వామిని అభిమానించని వాళ్ళు లేరు, ఆమె అభిమానుల మనసులు గెలుచుకుంది. విన్నర్ కాకపోయినా అంతటి ప్రేమను ఆమె అభిమానులు ఆమెకి చూపించారు.
అయితే తనూజ ఇంకా హైదరాబాద్ లోనే ఉంది. ఆమె తన ముద్ద మందారం టీమ్ తో సెలెబ్రేట్ చేసుకుని అభిమానులతో కలిసి చిట్ చాట్ చేసింది. అంతేకాకుండా తనూజ హైదరాబాద్ కూకట్ పల్లిలోని చీర్ ఫౌండేషన్ కి వెళ్లి అక్కడ అనాధ పిల్లలతో కలిసి టైమ్ స్పెండ్ చెయడం చూసిన వారు తనూజ మళ్లీ మళ్లీ అభిమానుల మనసులను గెలిచింది.. అంటూ మాట్లాడుకునేలా చేసింది.
20 లక్షల సూట్ కేస్ ఎందుకు తీసుకోలేదు అంటే అవి చేరవలసిన చోటుకే చేరాయి, అందుకు నేను హ్యాపీ అంటూ చాలా ఈజీగా చెప్పిన తనూజను చాలామంది లైక్ చెయ్యడంలో తప్పులేదు.




రిలేషన్స్ తో సఫర్ అయిన బ్యూటీ
Loading..