Advertisementt

ఫిలింఛాంబ‌ర్‌పై పెద్ద‌న్న‌ల ఆధిప‌త్యం

Sun 28th Dec 2025 05:09 PM
film chamber  ఫిలింఛాంబ‌ర్‌పై పెద్ద‌న్న‌ల ఆధిప‌త్యం
Film Chamber ఫిలింఛాంబ‌ర్‌పై పెద్ద‌న్న‌ల ఆధిప‌త్యం
Advertisement
Ads by CJ

తెలుగు ఫిలింఛాంబ‌ర్ ఎన్నిక‌లు ఈరోజు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కొచ్చిన అంశం. మ‌న ప్యానెల్, ప్రొగ్రెస్సివ్‌ ప్యానెల్ మ‌ధ్య పోటీ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగ‌గా, మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌తో ఎల‌క్ష‌న్ ముగిసింది. ఈ ఆదివారం(28-12-2025) సాయంత్రం నాటికి రిజ‌ల్ట్ కూడా తేలిపోనుంది. 

అయితే ఈసారి కూడా పోటీబ‌రిలో పెద్ద‌న్న‌లు అండ‌గా ఉన్న ప్రోగ్రెస్సివ్ ప్యానెల్ కే అధికారం ద‌క్క‌నుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఈ ప్యానెల్ లో దిల్ రాజు, అల్లు అర‌వింద్, డి సురేష్ బాబు, స్ర‌వంతి రవికిషోర్,  ర‌వి ఎర్నేని వంటి ప్ర‌ముఖులు ప్ర‌ధాన భూమిక‌ను పోషిస్తున్నారు. త‌మ ప్యానెల్ ని గెలిపించుకునేందుకు వీరంతా శాయాశ‌క్తులా ప్ర‌య‌త్నించారు.

ప్ర‌త్య‌ర్థి `మ‌న ప్యానెల్‌`లో అంత‌గా సినిమాలు తీయ‌ని సి.క‌ళ్యాణ్, ప్ర‌స‌న్న‌కుమార్ త‌దిత‌రులు ఉన్నారు. సినిమాలు తీసేవాళ్ల కోసం ప్యానెల్ అంటూ ప్రొగ్రెస్సివ్ ప్యానెల్ ప్ర‌చారానికి దిగ‌డంతో ఇప్పుడు 3400 మంది ఓట‌ర్ల‌లో మెజారిటీ వ‌ర్గం పెద్ద‌న్న‌ల ప‌క్షం నిల‌బడ్డార‌ని చ‌ర్చ సాగుతోంది. అయితే మ‌రికాసేప‌ట్లో ప‌లితాలు వెలువ‌డనుండగా ఉత్కంఠ నెల‌కొంది. 

స్టూడియోస్ సెక్టార్, పంపిణీ సెక్టార్, ఎగ్జిబిట‌ర్ సెక్టార్, నిర్మాత‌ల సెక్టార్.. నాలుగు విభాగాల నుంచి ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఈసారి ఎగ్జిబిట‌ర్ సెక్టార్ నుంచి అధ్య‌క్షుడిని ఎన్నుకోనున్నారు. 32 మంది ఈసీ స‌భ్యులు, ఇత‌ర కార్య‌ద‌ర్శుల‌ను ఎంపిక చేస్తారు.  

Film Chamber:

Film Chamber

Tags:   FILM CHAMBER
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ