కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసారు. తన చివరి సినిమా జన నాయగన్ ఆడియో లాంచ్ వేడుకలో విజయ్ అభిమానుల సమక్షంలో సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్టుగా ప్రకటించారు. తన సినీజర్నీని గుర్తు చేసుకుంటూ విజయ్ ఎమోషనల్ అయ్యారు.
నేను సినిమా ఇండస్ట్రీ లోకి ఎన్ని విమర్శలు ఎదుర్కొన్న అభిమానులు ఆదరించారు. చిన్న ఇల్లు కట్టుకుంటే చాలనుకున్నా, కానీ పెద్ద రాజమహల్ నా కోసం ఇచ్చారు. అంతా అభిమానుల వల్లే. 30 ఏళ్లుగా నన్ను ప్రోత్సహించేది మీరే. అందుకే వారికి ఇప్పుడు ఎప్పుడు సపోర్ట్ గా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా విజయ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
సినిమాలు వదిలేసినా పొలిటికల్ గా అందరికి దగ్గరగా ఉంటాను అంటూ విజయ్ అభిమానులకు హామీ ఇచ్చారు. జన నాయగన్ సినిమా విడుదల తర్వాత ఇక విజయ్ సినిమా సెట్ లో కనిపించారు అనే ఊహే అభిమానులను బాధపెడుతున్నా, రాజకీయాలతో నిత్యం ఆయన ప్రజల్లో ఉండబోతున్నారనే ఊహ వారిని శాంతపరుస్తుంది.




కియారాకి మాతృత్వం నేర్పిన పాఠాలు
Loading..