ఎవరైనా నటుడు తన కెరీర్ చిట్ట చివరి సినిమాలో నటిస్తుంటే, చివరి రోజు చివరి క్షణాలు ఎంతో ఉద్విగ్నంగా హృదయాలను తాకుతాయి. అలాంటి ఒక అరుదైన క్షణం దళపతి విజయ్ జీవితంలో ఎదురు కానుంది. అలాంటి ఉత్కంఠను ఇప్పుడు అతడి అభిమానులు ఎదుర్కొంటున్నారు. విజయ్ నటించిన `జననాయగన్` చిత్రీకరణను పూర్తి చేసుకుని వచ్చే సంక్రాంతి బరిలో విడుదలకు సిద్ధమవుతోంది.
అంతకుముందే ఈ శనివారం నాడు `జననాయగన్` ఆడియో వేడుక అత్యంత భారీగా భావోద్వేగాలకు నెలవు కాబోతోంది. దాదాపు 80 వేల మంది ఫ్యాన్స్ ని తరలిస్తున్న ఈ వేదిక ఎంతగా ఎమోషన్స్ తో ఊగిపోతుందో ఊహించుకుంటేనే దడ పుడుతోంది. ఈ వేదిక వద్ద విజయ్ వీరాభిమానులు అక్కడ వీరంగం వేస్తారు. కన్నీటితో తమ హీరో చివరి సినిమా ఉద్విగ్న క్షణాలను `వీడ్కోలు వేడుక`గా జరుపుకుంటారు. ఇకపై రాజకీయాల్లో మాత్రమే అతడిని చూడగలరు.. విజయ్ తిరిగి నటిస్తాడా లేదా? అన్నది చెప్పలేం. అతడు పూర్తిగా వార్ లో తలమునకలుగా ఉంటాడు. తమిళనాడును ముఖ్యమంత్రిగా ఏలాలనే కసి అతడిలో స్పష్టంగా కనిపిస్తున్నందున వందశాతం ప్రజా జీవితంలోనే తలమునకలుగా ఉంటాడని అభిమానులు కూడా ఊహిస్తున్నారు. హెచ్ వినోద్ తెరకెక్కించిన జననాయగన్ 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
`జననాయగన్` ఆడియో కౌలాలంపూర్‌లోని చారిత్రాత్మక బుకిట్ జలీల్ నేషనల్ స్టేడియంలో అత్యంత భారీగా జరగనుంది. విజయ్ ఇప్పటికే అక్కడికి ప్రయివేట్ జెట్ లో చేరుకున్నారు. సినీపరిశ్రమ నుంచి స్టార్ హీరో ధనుష్ సహా చాలామంది ప్రముఖులు హాజరవుతున్నారు. తమిళగ వెట్రి కజగం ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్, దర్శకుడు నెల్సన్, లోకేష్ కనగరాజ్, అట్లీ, ప్రభుదేవా, అనిరుధ్ రవిచంద్రన్ తదితరులు వేడుకకు అటెండవుతున్నారు.




అల్లు అర్జున్ ఫస్ట్, ప్రభాస్ సెకండ్ 
Loading..