చాలామంది అభిమానులే కాదు ఆడియన్స్ కూడా హీరోలను గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తూ ఉంటారు. అందుకు తగిన క్రేజ్, ఫేమ్ అన్ని ఆ సెర్చింగ్ కి కారణమవుతుంది. అక్కడ హీరోగా ఏ రేంజ్ లో ఉండాలో, ఏ స్థానంలో ఉండాలో సినిమా కలెక్షన్స్ డిసైడ్ చేస్తే.. ఇక్కడ గూగుల్ సెర్చ్ లోను ఏ హీరోని ఎక్కువ సెర్చ్ చేస్తే ఆ హీరోకి అంత క్రేజ్ ఉన్నట్టే.
తాజాగా గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2025 గణాంకాలను రిలీజ్ చేసింది. ఈ ఇయర్ ఇన్ సెర్చ్ లో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎవరు అంటే ఏ హీరో నెంబర్ 1 అనేది ఫుల్ క్లారిటీ వచ్చేసింది. బాహుబలి తో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసిన ప్రభాస్ ని కాదని, పుష్ప సీరిస్ పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టిన అల్లు అర్జున్ కి నెంబర్ 1 పొజిషన్ దక్కింది.
పుష్ప 2 చిత్రం భారీ హిట్ అవడమే కాదు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తేవడం, పుష్ప ప్రీమియర్స్ రోజున తొక్కిసలాట వెరసి అల్లు అర్జున్ ను గూగుల్ లో విపరీతంగా సెర్చ్ చేసినట్లుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ తర్వాతే ప్రభాస్ నిలవడం గమనార్హం. ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ లాంటి బిగ్ ప్రాజెక్ట్ చేస్తున్నా.. ప్రభాస్ రెండో స్థానంలోనే ఉన్నారు.
ఇక మూడో స్థానంలో వారణాసి తో పాన్ ఇండియా కి వెళుతున్న మహేష్ బాబు ఉండగా.. నాలుగో స్థానంలో OG హిట్, అలాగే పొలిటికల్ గా ట్రెండ్ అవుతున్న పవన్ ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ ఐదో స్థానంలో ఉన్నాడు.




స్టార్ వారసులపై తేజ సజ్జా కామెంట్స్ 
Loading..