బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువగా ఆడియన్స్ ఇష్టపడిన కంటెస్టెంట్ కన్నడ నటి తనూజ. ఆమె గేమ్ చూడలేదు, తనూజ డ్రెస్సింగ్ స్టయిల్, ఇంకా ఆమె మాట తీరు ను ఆడియన్స్ బాగా లైక్ చేసారు. అంతేకాకుండా కళ్యాణ్ పడాల కు గురువుగా, ఫ్రెండ్ గా, రీతూ, ఇమ్ము, భరణి లతో బాండింగ్ పేరుతో స్నేహం అన్ని తనూజపై ప్రేక్షకుల ఇష్టానికి కారణమయ్యాయి.
అసలు బిగ్ బాస్ 9 కి కంటెంట్ ఇచ్చిందే తనూజ, విన్నర్ కాబోయి రన్నర్ అయిన తనూజ కి హౌస్ లో నాగార్జున 20 లక్షలు ఆఫర్ చేసారు. నాకు డబ్బు వద్దు అంది, రన్నర్ గా నిలిచిన తనూజ ని చూసి అయ్యో ఆ 20 లక్షల సూట్ కేస్ తనూజ తీసుకోవాల్సింది అని అందరూ ముఖ్యంగా ఆమె అభిమానులు అనుకున్నారు.
బిగ్ బాస్ బజ్ లో హోస్ట్ శివాజీ కూడా అదే అన్నాడు. దానికి తనూజ నాకు డబ్బు ముఖ్యం కాదు ట్రోఫీ నే ముఖ్యం అంది. అయితే తాజాగా ఆమె ఇన్స్టా లైవ్ లోకి వచ్చింది. లైవ్ లో అభిమానులు మీరు కళ్యాణ్ పడాల విన్ అయ్యాడని ఫీలయ్యారా కంగ్రాట్స్ చెప్పలేదు అంటే లేదు నేను అమ్మను, చెల్లిని చూసి కొన్ని నెలలు అవడంతో వెంటనే వెళ్ళిపోయాను, తర్వాత చెప్పాను అంది.
ఆతర్వాత ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్, కళ్యాణ్, మాధురి ఇలా అందరితో బాండింగ్ పై అభిమానులు ప్రశ్నలడిగారు. అంతేకాకుండా 20 లక్షలు తీసుకోవాల్సింది అని అభిమానులు అనగానే లేదు ఆ 20 లక్షలు చేరాల్సిన చోటికే చేరాయి, ఆ విషయం లో నేను హ్యాపీ నే అంటూ తనూజ అభిమానులకు చెప్పింది.
మరి కళ్యాణ్ పడాల కు ఆ 20 లక్షలు విన్నింగ్ లో యాడ్ అవడం తనూజ కి సంతోషాన్నిచ్చింది ఇది కదా మా తనూజ అంటే అంటూ మరోసారి తనూజ అభిమానుల మనసు గెలిచింది అంటూ మాట్లాడుకుంటున్నారు.




రూ.1000 కోట్ల సక్సెస్ తో ముగింపు 
Loading..