బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలకు పాన్ ఇండియా మార్కెట్ లో విపరీతంగా డిమాండ్ ఉన్నప్పటికీ మేకర్స్ దానికి తగ్గ ప్రమోషన్స్ చేయలేకపోతున్నారు. పాన్ ఇండియా మార్కెట్ లో ప్రభాస్ సినిమా ల డిమాండ్ ని బట్టి నిర్మాతలు క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నారు తప్ప ప్రోపర్ గా పాన్ ఇండియా ఆడియన్స్ కు ప్రభాస్ సినిమాలను ప్రమోషన్స్ పరంగా చేరవెయ్యలేకపోతున్నారు.
సాహో దగ్గరనుంచి ప్రభాస్ నటించిన ప్రతి సినిమాకి పాన్ ఇండియా ప్రమోషన్స్ సమస్యగా మారింది, ప్రభాస్ సహకరించరో, లేదంటే నిర్మాతల ప్రాబ్లెమ్ అనేది తెలియదు. ఇప్పుడు ప్రభాస్ లేటెస్ట్ చిత్రం ద రాజా సాబ్ పరిస్థితి అలానే కనబడుతుంది. జనవరి 9 న పాన్ ఇండియా మార్కెట్ లో ఈ చిత్రం విడుదల కాబోతుంది.
రిలీజ్ కి పట్టుమని 20 రోజులు లేదు, ఇప్పటివరకు ప్రభాస్ ఎక్కడా రాజాసాబ్ ప్రమోషన్స్ లో కనిపించలేదు. దర్శకుడు మారుతి, హీరోయిన్స్ మాత్రమే ప్రమోషన్స్ లో కనబడుతున్నారు. హైదరాబాద్ లో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారు, దానికి ప్రభాస్ వస్తారని అంటున్నా క్లారిటీ లేదు.
మరి పాన్ ఇండియా మార్కెట్ లో విడుదల కాబోయే రాజాసాబ్ ని ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో ప్రమోట్ చేస్తారా, లేదంటే జస్ట్ హైదరాబాద్ తోనే సరిపెడతారా అనేది తెలియక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు.




1000 కోట్ల క్లబ్లో యానిమల్
Loading..