తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన `యానిమల్` 2024లో విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్, బాబి డియోల్, ట్రిప్తి దిమ్రీ కెరీర్ లో ఇది గేమ్ ఛేంజర్ మూవీ. అయితే ఈ సినిమా ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ దాదాపు 915కోట్లు వసూలు చేసింది. ఇందులో 555 కోట్ల నెట్ (గ్రాస్ వసూళ్లు ఇంకా ఎక్కువ) కేవలం భారతదేశం నుంచి వసూలైంది.
అయితే యానిమల్ చిత్రం 1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ దురంధర్ 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ అంచనా వేస్తుండగా, ఆ తర్వాత యానిమల్ కూడా 1000 కోట్ల క్లబ్ అందుకునే సినిమా అవుతుందని విశ్లేషిస్తోంది. దీనికి కారణం యానిమల్ చిత్రాన్ని జపనీ భాషలోకి అనువదించి ఆ దేశంలో భారీగా విడుదల చేస్తుండటమే.
ఇటీవలి కాలంలో ఆర్.ఆర్ఆర్ చిత్రం జపాన్ లో 150కోట్లు వసూలు చేసింది. బాహుబలి 2, కేజీఎఫ్ చిత్రాలు కూడా జపనీ భాష నుంచి భారీ వసూళ్లను సాధించాయి. అందుకే ఇప్పుడు `యానిమల్` కూడా జపాన్ నుంచి భారీ వసూళ్లను సాధిస్తుందని, ఈ చిత్రం 1000కోట్ల క్లబ్ లో కచ్ఛితంగా అడుగుపెడుతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, రాజమౌళి, సుకుమార్ తర్వాత సందీప్ వంగా కూడా 1000 కోట్ల క్లబ్ దర్శకుల జాబితాలో చేరిపోతాడు.




శర్వా బైకర్ పరిస్థితేమిటి
Loading..