గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కొన్ని నెలలుగా భారత్ లోనే ఉంటోన్న సంగతి తెలిసిందే. మహేష్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `వారణాసి`లో హీరోయిన్ గా నటించడంతో పీసీకి ఇండియాలో ఉండక తప్పలేదు. లాంగ్ హాలీడేస్ వస్తే తప్ప న్యూయార్క్ వెళ్లడం లేదు. ముంబై, హైదరాబాద్ లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా కూడా బాలీవుడ్ టాక్ షోల్లోనూ పాల్గొంటుంది. ఇప్పటికే `ది గ్రేట్ ఇండియన్` కపిల్ శర్మ టాక్ షోకి అటెండ్ అయిన సంగతి తెలిసిందే.
కొన్ని క్లిపింగ్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. టాక్ షోలో ఎన్నో వ్యక్తిగత విషయాలు..ఫ్యామిలీ విషయాలు పీసీ ఎంతో ఓపెన్ గా పంచుకుంది. కానీ ఎక్కడా చెప్పని ,ఎప్పుడూ చెప్పని ఓ టాప్ సీక్రెట్ పై పీసీ ఓపెన్ అయిపోయింది. అది వింటే? నవ్వులు పువ్వులే. కడుపు చెక్కలయ్యే సన్నివేశమే అది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ప్రియాంకకు ఇండియన్ ఛట్‌పటా స్నాక్స్ - క్యాండీలు అంటే చాలా ఇష్టమని తెలిపింది.
తాను అమెరికాలో ఉంటున్నప్పటికీ ఇంట్లో మాత్రం హాజ్మోలా, ఆమ్ పాపడ్ వంటి చిరుతిళ్ల కోసం ఒక ప్రత్యేకమైన క్యాబిన్ ఏర్పాటుచేసుకున్నానంది. ప్రియాంక చోప్రా వాటిని తీసుకుని తింటునప్పుడల్లా? నిక్ జోనాస్ తానేంతింటుందని ఎంతో ఆసక్తిగా చూస్తాడింది. చాలా రోజుల పాటు అది గమనించిన నిక్ ఓ రోజు ధైర్యం చేసి ఆస్నాక్స్ గురించి అడిగగా, పీసీ ఇలా బధులిచ్చింది. `నీకు ఈ రుచులు అర్థం కావు. వీటి జోలికి రాకు` అని చెప్పింది. అయినా నిక్ వదిలి పెట్టలేదు.
వాటి రుచి ఎలా ఉంటుందో తాను కూడా చూడాలనుకున్నాడు. దీంతో పీసీ కూడా నీ ఇష్టం అంటూ ఒక హాస్మోలా రుచి చూపించింది. అది తిన్న వెంటనే నిక్ షాక్ అయ్యాడు. ఇదేంటి పిత్తి వాసన వస్తుందని ఓపెన్ గా అనేసాడు. దీంతో అప్పుడు నవ్వుకోవడం పీసీ వంతైతే? అది చెప్పి భారతీయ జనాలందర్నీ తాజాగా పీసీ కడుపు చెక్కలయ్యేలా నవ్వించేసింది పీసీ. షోను హోస్ట్ చేస్తోన్న కపిల్ సహా ఎదురుగా ఉన్న కెమెరా సిబ్బంది కూడా నవ్వు ఆపుకోలేక పోయారు.




BB 9 విన్నర్ కళ్యాణ్ కి ఇంత అతి అవసరమా 
Loading..