Advertisementt

BB 9 విన్నర్ కళ్యాణ్ కి ఇంత అతి అవసరమా

Wed 24th Dec 2025 03:47 PM
kalyan padala  BB 9 విన్నర్ కళ్యాణ్ కి ఇంత అతి అవసరమా
Bigg Boss 9 Winner Kalyan Padala BB 9 విన్నర్ కళ్యాణ్ కి ఇంత అతి అవసరమా
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ హౌస్ లోకి కామనర్ గా అడుగుపెట్టి ఈరోజు బిగ్ బాస్ ట్రోఫీ ని అందుకున్న కళ్యాణ్ పడాల తన విజయం వెనుక తనూజ ఉంది అంటూ బహిరంగంగానే క్రెడిట్ మొత్తం తనూజ కి ఇచ్చేసాడు. కళ్యాణ్ పడాల గెలవడానికి మరో కారణం బిగ్ బాస్ రివ్యూయర్స్ అని చెప్పాలి. తనూజ మోరల్ సపోర్ట్ ఇస్తే.. బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే గీతూ రాయల్, ఆది రెడ్డిలు ఫ్యాన్స్ లో ఊపు తెచ్చి ఓట్లు వేయించారు. 

అయితే కప్ గెలిచాక కళ్యాణ్ పడాల లైవ్ లోకొచ్చాడు. తనూజ మీరు విన్నర్ అయ్యాక మీకు కంగ్రాట్స్ కూడా చెప్పలేదు అంటూ అభిమానులు అడగగా.. లేదండి చెప్పింది, మీరు చూడలేదు, తనూజ నా బెస్ట్ ఫ్రెండ్, గట్టిగా మాట్లాడితే ఆమె తో లైఫ్ లాంగ్ ఉంటాను, తనూజాపై ఎలాంటి నెగిటివిటీ చూపించొద్దు, తన వల్లే నేను ఇక్కడివరకు వచ్చాను అంటూ కళ్యాణ్ పడాల అభిమానులకు సలహా ఇచ్చాడు. 

అయితే విన్నర్ అయ్యాక కళ్యాణ్ పడాల తన ఊరికి వెళ్ళాడు. భారీ ర్యాలీతో అభిమానుల హడావిడి మద్యన కార్ పైకి ఎక్కి ట్రోఫీ తో కళ్యాణ్ పడాల నానా హంగామా చేసాడు. ఒక కామనర్ ఇలా ట్రోఫీ గెలవడం అనేది సంచలనమే అయినా కళ్యాణ్ పడాల అంతలా ఓవరేక్షన్ చెయ్యడమెందుకు, అభిమానులు అంటూ వెంటపడిన వారే తర్వాత దొరకరు, ఇప్పడు విజయ గర్వాన్ని నెత్తికెక్కించుకోకు, గతంలో పల్లవి ప్రశాంత్ మాదిరి చెయ్యకు. 

పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యి ఏం పీకాడు, జాగ్రత్తగా కెరీర్ కి బాటలు వేసుకో, అభిమానుల ఆరాటం చూసి పడిపోకు అంటూ కళ్యాణ్ పడాల కు చాలామంది సలహాలు ఇవ్వడం గమనార్హం. 

Bigg Boss 9 Winner Kalyan Padala:

Kalyan Padala Hometown Celebrations

Tags:   KALYAN PADALA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ