Advertisementt

హీరోయిన్స్ ఎక్స్‌పోజింగ్‌పై ఘాటు వ్యాఖ్య‌లు

Tue 23rd Dec 2025 11:10 AM
sivaji  హీరోయిన్స్ ఎక్స్‌పోజింగ్‌పై ఘాటు వ్యాఖ్య‌లు
Shivaji Comments on Heroines Dressing Spark Controversy హీరోయిన్స్ ఎక్స్‌పోజింగ్‌పై ఘాటు వ్యాఖ్య‌లు
Advertisement
Ads by CJ

ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాల‌లో ఫోటోషూట్ల పేరుతో హ‌ద్దుమీరి గ్లామ‌ర్ ని చిందిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే దీనిని ప్ర‌శ్నించే మ‌గ‌వాళ్లు స్త్రీ స్వేచ్ఛ‌ను హ‌రించిన‌ట్టేనా? అయితే న‌టుడు శివాజీ `దండోరా` ప్రీరిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్ల‌పై మ‌హిళ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది.

దండోరా ఈవెంట్‌లో వేదిక‌పై ఉన్న యాంక‌ర్ ఎంతో ప‌ద్ధ‌తిగా హుందాగా చీర‌లో క‌నిపించింద‌ని పొగిడేసిన శివాజీ, ఇటీవల హ‌ద్దుమీరి ఎక్స్ పోజ్ చేస్తున్న క‌థానాయిక‌ల శైలిని త‌ప్పు ప‌ట్టారు. అందం అనేది హుందాత‌నంలో, గౌర‌వంలో ఉంటుంద‌ని అన్నారు. ప్ర‌జ‌లు ఎక్స్ పోజ్ చేసే న‌టీమ‌ణుల‌ను చూసిన‌ప్పుడు న‌వ్విన‌ట్టు క‌నిపించినా కానీ, తెర వెన‌క నుంచి వెకిలిగా మాట్లాడుకుంటార‌ని కూడా అత‌డు అన్నాడు. అందంగా దుస్తులు ధ‌రించి గౌర‌వాన్ని నిలబెట్టుకున్న క‌థానాయిక‌లు మ‌న‌కు ఉన్నార‌ని కూడా శివాజీ వ్యాఖ్యానించారు. న‌టీమ‌ణులు డ్రెస్ సెన్స్ విష‌యంలో హ‌ద్దు మీరాల్సిన అవ‌స‌రం లేద‌ని సూచించారు. సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో దుస్తుల‌ను ధ‌రించ‌డంలో త‌న త‌ల్లి పాటించిన నియ‌మాలు ప్ర‌తిసారీ గుర్తుకు వ‌స్తార‌ని అన్నారు.

అయితే శివాజీ కామెంట్లు ఒక సెక్ష‌న్ నెటిజ‌నుల‌కు రుచించ‌లేదు. వారంతా స్త్రీ స్వేచ్ఛ‌ను హ‌రించేలా వ్యాఖ్యానించాడ‌ని కామెంట్ చేస్తున్నారు. దండోరా చిత్రం ఈనెలలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. దండోరా చిత్రం ప్రీరిలీజ్ వేడుకలో న‌టీన‌టులు చిత్ర‌బృందం పాల్గొంది.

Shivaji Comments on Heroines Dressing Spark Controversy:

Sivaji stirs controversy yet again

Tags:   SIVAJI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ