Advertisementt

X లో ట్రెండ్ అవుతున్న బిగ్ బాస్ తనూజ

Sat 20th Dec 2025 05:07 PM
thanuja  X లో ట్రెండ్ అవుతున్న బిగ్ బాస్ తనూజ
Bigg Boss Thanuja is trending on X X లో ట్రెండ్ అవుతున్న బిగ్ బాస్ తనూజ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 9 లో క్రేజీ కంటెస్టెంట్ గా అందరి మనసులను గెలుచుకున్న సీరియల్ నటి తనూజ అంటే ఇష్టపడని ప్రేక్షకులు లేరు. ఆమె డ్రెస్సింగ్ స్టయిల్, ఆమె పోరాటతత్వాన్ని అందరూ ఇష్టపడ్డారు. మధ్య మధ్యలో వైల్డ్ కార్డు ఎంట్రీలు, శ్రీజ లాంటి వాళ్ళు ఆమెను కించపరిచినా పోరాడింది, కళ్యాణ్ తో తన ఫ్రెండ్ షిప్ అంటూ అతనికి ఎలాంటి అసలు కల్పించకుండా క్లారిటీ ఇచ్చింది. 

ఇక ఇమ్మన్యుయెల్ తో స్నేహం, భరణితో నాన్న బాండింగ్, మిగతా వాళ్లతో ఫైట్ చేసే తనూజ గెలవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. కానీ కళ్యాణ్ పడాల గెలుపు కోసం ప్రచారం చేస్తున్న కొంతమంది సీరియల్ నటులు తనూజ వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు. ఆమె గురించి, తనూజ బిహేవియర్ బాగోదు అంటూ ఆమెపై విషం చిమ్ముతున్నారు. 

ప్రస్తుతం టైటిల్ ఫెవేరేట్ గా ఉన్న తనూజ ను ఆమె అభిమానులు సోషల్ మీడియా X లో ట్రెండ్ చేస్తున్నారు. తనూజ కు ఓటెయ్యాలంటూ ఆమె ఫ్యాన్స్ మాత్రమే కాదు ముద్ద మందారం సీరియల్ నటులు అలాగే ఆమె ఫ్రెండ్స్ నటరాజ్ మాస్టర్, శేఖర్ భాష, బెబక్క లాంటి వాళ్ళు తనూజ కు సపోర్ట్ చేస్తూ వీడియోస్ చెయ్యడంతో తనూజ అనూహ్యంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. 

Bigg Boss Thanuja is trending on X:

BB QUEEN THANUJA on X

Tags:   THANUJA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ