టాప్ హీరోయిన్ రష్మిక మందన్న కొన్నేళ్లుగా తన బాయ్ ఫ్రెండ్ హీరో విజయ్ దేవరకొండ తో సీక్రెట్ డేటింగ్ చేస్తూ ఈ ఏడాది అక్టోబర్ లో నిశ్సితార్ధం చేసుకున్న విషయాన్ని కూడా అంతే సీక్రెట్ గా ఉంచింది. కానీ మీడియా కనిపెట్టేసింది. అయితే రష్మిక కానీ, విజయ్ దేవరకొండ కానీ ఈ నిశ్చితార్ధపు వ్యాఖ్యలను ఖండించలేదు.
ఫిబ్రవరిలో రష్మిక-విజయ్ దేవరకొండ ల వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారంటున్నారు. రీసెంట్ గా రష్మిక పెళ్ళికి ముందు తన స్నేహితులతో కలిసి బ్యాచిలొరెట్ పార్టీ చేసుకుంది. శ్రీలంక వెళ్లి అక్కడ గర్ల్స్ అంతా ఛిల్ అవుతున్న ఫొటోస్ చూసి రష్మిక పెళ్ళికి ముందు తన ఫ్రెండ్స్ కి అదిరిపోయే పార్టీ ఇచ్చింది అంటున్నారు.
అంతేకాకుండా రష్మిక తన పెళ్ళికి సంబందించిన షాపింగ్ ని కూడా మొదలు పెట్టింది అని తెలుస్తుంది. రష్మిక తన పెళ్లి షాపింగ్ దుబాయ్ లో చేస్తుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.




వల్లభనేని వంశీకి మరో షాక్
Loading..