వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధినాయకుడు జగన్ అండ చూసుకుని రెచ్చిపోయి టీడీపీ ని ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హైలెట్ అయిన గన్నవరం మాజీ ఎమ్యెల్యే వల్లభనేని వంశికి కూటమి ప్రభుత్వం చుక్కలు చూపించింది. టీడీపీ కార్యకర్త సత్యమూర్తి కిడ్నాప్ కేసులో దాదాపుగా నాలుగున్నర నెలలు జైలులో ఉండి వచ్చిన వంశి ఆ జైలు జీవితంలో అనారోగ్యంతో సతమతమయ్యాడు.
ఆతర్వాత బెయిల్ పై బయటికొచ్చాక రాజకీయాలకు దూరంగా ఉంటున్న వల్లభనేని వంశీ ఈమధ్యన గన్నవరం నియోజకవర్గంలో కార్యకర్తలతో కలిసి హడావిడి చేసాడు. తాజాగా వంశీకి మరో షాక్ తగిలింది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ లో సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వంశీతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
2024 జులై నెలలో తన(సునీల్)పై వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.




రామ్ చరణ్ పై మంచు మనోజ్ కామెంట్స్ 
Loading..