సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన `జైలర్` రజనీ కెరీర్ బెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీ నటనతో పాటు, అనిరుధ్ రవిచందర్ రీరికార్డింగ్ కి మంచి గుర్తింపు వచ్చింది. అయితే వీటన్నిటినీ మించి ఈ సినిమాలో `కావాలా..` స్పెషల్ నంబర్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. `కావాలా..` పాటలో మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా స్టెప్పులు యువతరానికి హీట్ పుట్టించాయి. ఈ పాట సోషల్ మీడియాలు, యూట్యూబ్‌లలో జోరుగా వైరల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా యూత్ కావాలా పాటకు స్టెప్పులేసారు.
అందుకే ఇప్పుడు జైలర్ 2లో అలాంటి స్పెషల్ నంబర్ ఉంటుందా? అని ఆరాలు తీస్తున్నారు. అలాంటివారికి గుడ్ న్యూస్ అందింది. జైలర్ 2 చిత్రీకరణ ప్రస్తుతం స్వింగ్ లో ఉంది. ప్రస్తుతం నోరా ఫతేహిపై ఓ స్పెషల్ నంబర్ ని చిత్రీకరిస్తున్నారు. ఇది తమన్నా కావాలాను మించి ఉంటుంది. కావాలా పాటకు తమన్నా అద్భుత నృత్యాలు కట్టి పడేసాయి.
అంతకుమించి నోరా కిక్కిచ్చే మూవ్స్ తో మతులు చెడగొడుతుందని తెలుస్తోంది. అయితే నోరా ఫతేహి స్పెషల్ నంబర్ లో నర్తిస్తున్న విషయాన్ని ఇంకా చిత్రబృందం అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం ఈ పాటను చెన్నై పరిసరాలలో చిత్రీకరిస్తున్నారు.




కాంతార2: రణ్వీర్ ఇమిటేషన్ పై రిషబ్ హాట్ కామెంట్స్ 
Loading..