గోవా ఫిలిం ఫెస్టివల్ లో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కాంతార చిత్రాన్ని పొగుడుతూ అందులో రిషబ్ శెట్టి ఓ.. అంటూ ఊగిపోయే సీన్ ని రణ్వీర్ సింగ్ ఇమిటేట్ చెయ్యడం అప్పట్లో తీవ్ర దుమారమే చెలరేగింది. రణ్వీర్ సింగ్ పై కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాదు ఆయన క్షమాపణ చెప్పేవరకు వదల్లేదు.
దానితో రణ్వీర్ సింగ్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెబుతూ.. రిషబ్ శెట్టి ఆ సీన్ లో యాక్టింగ్ చాలా బాగా చేశారని చెప్పడం కోసం నేను అలా నటించాను. అలాంటి కష్టమైన సన్నివేశాల్లో నటించడం ఎంత కష్టమో నాకు తెలుసు. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించండి అంటూ పోస్ట్ పెట్టారు.
తాజాగా రిషబ్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గోవా ఈవెంట్ లో రణ్వీర్ సింగ్ అలా కాంతార లో సీన్ చేయడం నాకు ఇబ్బందిగా అనిపించింది. దైవిక అంశాలతో రూపొందిన సినిమా అది. దానితో కన్నడ ప్రజలు ఎమోషనల్ కనెక్షన్ ఎక్కువగా ఉంది. అందుకే నేను ఎక్కడికెళ్లినా.. కాంతార లోని సన్నివేశాలను వేదికలపై కామెడీగా ఇమిటేట్ చేయొద్దని చెబుతుంటా అంటూ రిషబ్ శెట్టి రణ్వీర్ కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు.




ఇలా అయితే అఖండ 2 కష్టమే
Loading..