నవంబర్ చివరి వారంలో థియేటర్స్ లోకి వచ్చిన హీరో రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కొంతమంది ఆంధ్ర కింగ్ తాలూకా బావుంది అంటే.. కొంతమంది యావరేజ్ అంటూ పెదవి విరిచారు. రామ్, భాగ్యశ్రీ బోర్సే మధ్యన కెమిస్ట్రీ, రామ్ పెరఫార్మెన్స్ సూపర్ అన్నారు.
కానీ సినిమా టాక్ కి కలెక్షన్స్ సంబంధం లేకుండా పోయింది. రామ్ కెరీర్ లో ఆంధ్ర కింగ్ తాలూకా కూడా ప్లాప్ లిస్ట్ లోకి చేరిపోయింది. దానితో రామ్ కెరీర్ కి డేంజర్ బెల్స్ అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసిన ఆంధ్ర కింగ్ తాలూకా చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.
అయితే ఆంధ్ర కింగ్ తాలూకా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకోగా.. ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబర్ 25 క్రిష్టమస్ స్పెషల్ గా స్ట్రీమింగ్ లోకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఆంధ్ర కింగ్ తాలూకా విడుదలైన నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తుందన్నమాట.




BB 9: చివరి వారంలో చెలరేగిపోయిన డిమోన్ 
Loading..