బిగ్ సీజన్ 9 ముగియడానికి ఇంకా జస్ట్ నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. టాప్ 5 కంటెస్టెంట్స్ అంతా ఈ వారం ఎంజాయ్ చెయ్యడమే ఇకపై అనుకున్నారు. కానీ బిగ్ బాస్ మాత్రం చివరి వారంలోను టాప్ 5 హౌస్ మేట్స్ మధ్యన మంట పెడుతూనే ఉన్నాడు. చివరి వారంలోను టాస్క్ లతో హౌస్ మేట్స్ ని రెచ్చగొడుతున్నాడు.
ఈ టాస్క్ లను కూడా టాప్ 5 మెంబెర్స్ సీరియస్ గా తీసుకుని ఆడేస్తున్నారు, గొడవపడుతున్నారు. తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, పవన్, సంజన ఇలా ఎవ్వరూ తగ్గట్లేదు. కానీ ప్రతి టాస్క్ ని డిమోన్ పవన్ కొట్టేస్తున్నాడు. వన్ మ్యాన్ ఆర్మీ లా లాస్ట్ వీక్ లో డిమోన్ పవన్ రెచ్చిపోయి టాస్క్ విన్ అవుతున్నాడు.
ఈరోజు ఎపిసోడ్ లోను కళ్యాణ్ పడాల తో పవన్ ఫైట్ మాములుగా లేదు, మొదటినుంచి డిమోన్ పవన్ ఇలా ఆడి ఉంటే గనక డెఫనెట్ గా పవన్ టైటిల్ ఫెవరేట్ అయ్యేవాడు. కానీ రీతూ ఫ్రెండ్ షిప్ వల్ల డిమోన్ పవన్ ఈ సీజన్ కప్ కి దూరమయ్యాడు. అందుకే కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9 కప్ ఎగరేసుకుపోవడానికి కారణమయ్యాడు. లేదంటే ఈ సీజన్ నిజంగా డిమోన్ పవన్ దే అయ్యుండేది.




ప్లాస్టిక్ సర్జరీ కామెంట్స్ పై ఫైరయిన రకుల్ ప్రీత్ 
Loading..