బిగ్ బాస్ సీజన్ 9 ఆల్మోస్ట్ క్లోజింగ్ టైమ్ ఆసన్నమైంది. మరో నాలుగు రోజుల్లో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. ఈ ఆదివారమే ఆ ఈవెంట్ కి స్టార్ మా బిగ్ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే టాప్ 5 కి కళ్యాణ్ పడాల, తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్, సంజన వెళ్లిపోయారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా సుమన్ శెట్టి, భరణి ఎలిమినేట్ అయ్యారు.
అయితే కళ్యాణ్ కి కప్ కొట్టే ఛాన్స్ ఉంది అని చెప్పిన భరణి శివాజీ ఇంటర్వ్యూలో కళ్యాణ్ పడాల నే ఈ సీజన్ 9 విన్నర్ అంటూ డిక్లెర్ చేసారు. సుమన్ శెట్టి కూడా కళ్యాణ్ పడాల సీజన్ 9 విన్నర్ అవుతాడని చెప్పాడు. కామనార్ గా అగ్నిపరీక్ష ఎదుర్కొని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ తనూజ సలహాలతో ఆటతీరు మార్చుకుని హౌస్ మేట్స్ మనసులను గెలుచుకున్నాడు.
తన టాస్క్ పెరఫార్మెన్స్, ఇతర కంటెస్టెంట్స్ తో ఉన్న ఫ్రెండ్ షిప్, బయట అతనికి పెరిగిన అభిమాన గణం అంతా కళ్యాణ్ పడాల ని విన్నర్ కి చేరువ చేసాయి. కళ్యాణ్ పడాలనే ఈ సీజన్ విన్నర్ అంటూ బిగ్ బాస్ ఆడియన్స్ కూడా తేల్చేస్తున్నారు. ఆతర్వాత రన్నరప్ గా తనూజ గ్యారెంటీ. మరి అందరూ అనుకున్నట్టుగా కళ్యాణ్ పడాలనే ఈ సీజన్ విన్నర్ అవుతాడేమో చూద్దాం.




అఖండ 2 ఇంక మూడు వారాలే
Loading..