గత శుక్రవారం డిసెంబర్ 12 న భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి నటసింహ బాలకృష్ణ-బోయపాటి ల అఖండ 2 తాండవ చిత్రం అభిమానులను భారీగా ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. ఇటు ఆడియన్స్ ను కూడా డిజప్పాయింట్ చేసింది.
బోయపాటి-బాలయ్య కాంబో లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ అంత పవర్ ఫుల్ గా లేదు అంటూ నందమూరి ఫ్యాన్స్ కూడా అఖండ 2 పై మాట్లాడుకుంటున్నారు. బాలయ్య అఘోర కేరెక్టర్ లో శివతాండవమాడేసారు. కానీ స్టోరీ, అలాగే విలన్ కేరెక్టర్ ఆది పినిశెట్టి బాలయ్య కు సరిపోలేదు అంటూ కామెంట్స్ చేసారు. థమన్ మ్యూజిక్ మోత థియేటర్స్ దద్దరిల్లడం కాదు చెవులు చిల్లులుపడ్డాయి అంటున్నారు. మరి కొన్నాళ్లుగా హిట్ అయినా, ఫట్ అయినా ఏదైనా నెల తిరిగేలోపే సినిమాలు ఓటీటీ లో ప్రత్యక్షమవుతున్నాయి.
అదే మాదిరి మిక్స్డ్ రెస్పాన్స్ తో థియేటర్స్ లో రన్ అవుతున్న అఖండ తాండవాన్ని మరో మూడు వారాల్లో నెట్ ఫ్లిక్స్ లో చూసేయ్యోచ్చా అనే టాక్ మొదలైంది. అఖండ 2 తాండవం డిజిటల్ హక్కులు తీసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్ జనవరి 5 లోపే అఖండ 2 ని స్ట్రీమింగ్ లోకి తేవచ్చోనే ఊహాగానాలు మొదలయ్యాయి.




ఎందుకింత అతి అనసూయ
Loading..