ఈషారెబ్బా టాలీవుడ్ కి ఎన్నో కలలతో ఎంటర్ అయింది. కానీ అవి సాకారం అవ్వాలంటే? ప్రతిభ ఒక్కటే ఉంటే సరిపోదు. అంతకు మించి అదృష్టం కూడా కలిసొస్తేనే రాణించగలమని ఆలస్యంగా గ్రహించింది. దీంతో వస్తోన్న అవకాశాలతో సంతృప్తి పడుతూ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తోంది. తెరపై హీరోయిన్ గానూ కనిపించింది. సహాయ పాత్రలతోనూ మురిపించింది. ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు వచ్చినా కాదనుకుండా పని చేస్తోంది.
వెబ్ సిరీస్ లు...డాక్యుమెంటరీలు..షార్ట్ పిలింస్ లో సైతం నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే తరుణ్ భాస్కర్ కు జంటగా `ఓం శాంతి శాంతి శాంతి హీ` అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా తరుణ్ భాస్కర్ ని తన దర్శకత్వంలో హీరోయిన్ ఛాన్స్ కూడా ఇవ్వండిని ముందుగానే అర్జీ పెట్టుకుంది. నీ సరసన హీరోయిన్ గానే కాదు...నీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కూడా ఇస్తే సంతోషమంటూ కోరింది. మరి నోరు తెరిచిన అడిగిన ఈషాకు తరుణ్ ఛాన్స్ ఇస్తాడా? లేదా? అన్నది చూడాలి.
ప్రస్తుతం తరుణ్ కూడా దర్శకత్వం పక్కనబెట్టి నటుడిగా బిజీ అయిన సంగతి తెలిసిందే. రెండేళ్లగా యాక్టింగ్ లోనే కొనసాగుతున్నాడు. దర్శకత్వం అవకాశాలు వస్తున్నా నటుడిగా బిజీగా ఉండటంతో కెప్టెన్ కుర్చీ ఎక్కలేక పోతున్నాడు. వచ్చే ఏడాది మళ్లీ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. కొన్ని కథలు కూడా సిద్దం చేసి పెట్టుకున్నాడు. కొందరు యువ హీరోలు కూడా తరుణ్ తో సినిమాకు సిద్దంగానే ఉన్నారు. మరి వీటిలో తెలుగుమ్మాయికి ఓ ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.




సినీజోష్ రివ్యూ : అఖండ 2 
Loading..