Advertisementt

న‌టుడి వార్నింగ్..ఇండ‌స్ట్రీలో ఎవ‌రెవ‌రికి

Wed 10th Dec 2025 09:48 PM
dileep  న‌టుడి వార్నింగ్..ఇండ‌స్ట్రీలో ఎవ‌రెవ‌రికి
Dileep breaks silence after acquitta న‌టుడి వార్నింగ్..ఇండ‌స్ట్రీలో ఎవ‌రెవ‌రికి
Advertisement
Ads by CJ

ఓ న‌టి విష‌యంలో లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కోంటున్న మ‌ల‌యాళ న‌టుడు దిలీప్ కుమార్ నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్ల‌గా సాగుతోన్న ఈ కేసు విష‌యంలో దిలీప్ కుమార్ కు కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. అడిషనల్ స్పెషల్ సెషన్స్ కోర్ట్ దిలీప్‌పై ఉన్న అన్ని అభియోగాలను కొట్టేసింది. ఈ నేప‌థ్యంలో దిలీప్ కుమార్ ప్ర‌తి దాడికి రెడీ అవుతున్నాడు. త‌న‌పై కుట్ర ప‌న్నిన ఏ ఒక్క‌ర్నీ విడిచి పెట్ట‌నంటూ, చ‌ట్ట‌ప‌రంగా తీసుకోవాల్సిన‌ అన్నీచ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించాడు.

కావాల‌నే ఓ ఉద్యోగుల బృందం కేసులో ఇరికించింద‌ని, విచార‌ణ మొద‌లైన నాలుగు నెల‌ల వ‌ర‌కూ బాధిత మ‌హిళ త‌న పేరు చెప్ప‌లేద‌ని దీలీప్ అన్నారు. మాలీవుడ్ ప‌రిశ్ర‌మ నుంచి కూడా కొంత మంది సెల‌బ్రిటీలు తన‌పై కుట్ర పన్నార‌ని ఆరోపించాడు. అలాగే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) పైనా దిలీప్ ఫిర్యాదు దాఖలు చేయాలని భావిస్తు న్నాడు . కోర్టు తీర్పు కాపీని సమీక్షించిన అనంత‌రం  వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాన‌ని దిలీప్ తెలిపాడు.

ఈ కేసులో  సిట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా  తప్పు దోవ పట్టించిందని దిలీప్ అరోపించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ బంతి  దిలీప్ చేతుల్లో లేక‌పోవ‌డంతో?  తొమ్మిదేళ్ల‌గా ఇదే కేసులో విచార‌ణ ఎదుర్కున్నాడు. వృత్తి, వ్య‌క్తిగ‌త జీవితానికి ఈ కేసు ఎంతో భంగాన్ని క‌లిగించింది. అరెస్ట్ అవ్వ‌డం..తొమ్మిదేళ్ల పాటు బెయిల్ పై బ‌య‌ట ఉండ‌టం ఇవ‌న్నీ దిలీప్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసాయి. ప్ర‌తి చ‌ర్య‌గా దిలీప్ ఇప్పుడు రంగంలోకి  దితున్నాడు.

దీంతో మాలీవుడ్ లో ఇప్పుడీ వార్త ఆస‌క్తిక‌రంగా మారింది. దిలీప్ పై ప‌రిశ్ర‌మ నుంచి క‌క్ష గ‌ట్టిన వ్య‌క్తులు ఎవ‌రై ఉంటారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. వారంద‌రి పేర్ల‌ను దిలీప్ బ‌య‌ట పెట్టి..ప‌రువు న‌ష్టం స‌హా వివిధ కేసులు వేసే అవ‌కాశం ఉందని  వార్త‌లొస్తున్నాయి.      

Dileep breaks silence after acquitta:

Dileep

Tags:   DILEEP
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ